హోమ్ /వార్తలు /తెలంగాణ /

Metro: మెట్రో నుంచి రూ.1.7 కోట్ల పరిహారం ఇప్పించండి.. హైకోర్టులో ఓ మహిళ పిటిషన్​..

Metro: మెట్రో నుంచి రూ.1.7 కోట్ల పరిహారం ఇప్పించండి.. హైకోర్టులో ఓ మహిళ పిటిషన్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ మెట్రో రైల్ యాజమాన్యం నుంచి తనకు రూ.1.7 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ ఓ మహిళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్​ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) యాజమాన్యం నుంచి తనకు రూ.1.7 కోట్ల పరిహారం (Compensation of Rs. 1.7 crore )ఇప్పించాలంటూ ఓ మహిళ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మెట్రో పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో తన తలకు తీవ్రగాయం అయిందని ఆమె పేర్కొంది. తను ఆరోగ్యపరంగా, ఆర్థికంగానూ దెబ్బతిన్నానని, ఇందుకు మెట్రో యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఉజ్మా హఫీజ్‌ హైకోర్టు (High court)ను ఆశ్రయించారు.

  ఈ సందర్భంగా ఆమె ..  ‘‘ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఐదు రోజుల పాటు కోమాలో ఉన్నాను. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ గాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి’’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అనేక సమస్యలు వేధిస్తున్నాయని ఉజ్మా హఫీజ్‌ తెలిపారు. దృష్టిలోపం, మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. తనకు వైద్యం, ఇతర ఖర్చులను ఇప్పించి ఆదుకోవాలని కోరారు.

  ఇదే విషయంపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌ను పలుమార్లు ఆశ్రయించిన ఫలితం లేదని  ఉజ్మా హఫీజ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో వారికి బాధ్యత లేదని ఎల్ అండ్ టీ చూసుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ చెప్పిందని ఉజ్మా అన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించినట్టుగా ఆమె చెప్పారు.  కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం.. మున్సిపల్‌ శాఖ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు ధర్మాసం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. చూడాలి మరి ఏంజరుగుతుందో..!

  రోజురోజుకి కొన్ని ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించే హైద‌రాబాద్(Hyderabad)మెట్రో ఇప్పుడు ప్ర‌యాణికుల‌కు మ‌రింత చేరువ అవ‌డానికి వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే టిక్కెట్ రేట్లపై ఆఫ‌ర్స్‌తో ప్ర‌యాణికుల‌కు చేరువ‌ అవుతున్న మెట్రో ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి... ప్ర‌యాణికులు మెట్రో స్టేష‌న్స్(Metro Stations)లోనే షాపింగ్ (Shopping)చేసుకునే వెసులుబాటు క‌ల్పిస్తోంది. అయితే ఇక్క‌డ కూడా మెట్రో త‌న‌దైన మార్క్ వేసుకుంది. మ‌హిళ ఎంట్రప్రెన్యూర్‌(Entrepreneur)ను ప్రొత్స‌హించే ఉద్దేశంతో వారు ఉత్ప‌త్తి చేసిన ఉత్ప‌త్తుల‌కు మెట్రో స్టేష‌న్స్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్(Pilot project)క్రింది తొలుత అమీర్‌పేట(Ameerpet)మెట్రో స్టేష‌న్ లో ఈ సేవలను ప్రారంభించారు.

  ఈ స్టేష‌న్‌లో మ‌హిళ‌లు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌త్యేక‌మైన స్టాల్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ప్ర‌యాణికులు నాణ్య‌మైన ఉత్ప‌త్తుల‌ను చాలా అనువైన ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసుకునే వెసుల‌ుబాటు క‌ల్పిస్తోంది హైద‌రాబాద్ మెట్రో. కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకొని ఉత్ప‌త్తులు చేస్తోన్న మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో హైదారాబాద్ మెట్రో ఈ ముంద‌డుగు వేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Hyderabad Metro, Telangana High Court, WOMAN

  ఉత్తమ కథలు