హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad Story: అయ్యో తల్లీ.. నీకెన్నొ కష్టాలొస్తే గాని అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటావమ్మా..!

Sad Story: అయ్యో తల్లీ.. నీకెన్నొ కష్టాలొస్తే గాని అంతటి కఠిన నిర్ణయం తీసుకుంటావమ్మా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కట్నం (Dowry) తీసుకురావాలంటూ భార్యలను భర్తలు తీవ్రంగా కొడుతున్నారు. వారు పెట్టే హింస భరించలేక చాలా మంది మహిళలు తనువు చాలిస్తున్నారు.

  వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వరకట్నం అడగడం నేరమని తెలిసినా చాలా మంది యథేచ్ఛగా కట్నం అడుగుతున్నారు. పెళ్లికి ముందు ఇచ్చినంత తీసుకోవడం లేదా ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరగక పోతే అదనంగా కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారు. తీవ్రంగా చిత్రహింసలు పెడుతున్నారు. అటు భర్త, ఇటు అత్తమామలు, ఆడ పడచులు తీవ్రంగా వేధిస్తున్నారు. కట్నం తీసుకురావాలని శారీరకంగా వేధిస్తున్నారు. కట్నం (Dowry) తీసుకురావాలంటూ భార్యలను భర్తలు తీవ్రంగా కొడుతున్నారు. వారు పెట్టే హింస భరించలేక చాలా మంది మహిళలు తనువు చాలిస్తున్నారు. 100 మందిలో ఒకరో, ఇద్దరో మాత్రమే భర్తలు, అత్తింటి వారిపై పోలీసు కేసు పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో వరకట్న వేధింపులు (Dowry harassment) భరించలేక మరో మహిళ తనువు చాలించింది. ‘భర్త, అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను...అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

  పోలీసులు.. మృతురాలి కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ (Nalgonda) ఆనంద్‌నగర్‌కు చెందిన వ్యాపారి రాపోలు జనార్ధన్, జయమ్మల ఏకైక సంతానం నాగలక్ష్మి (36) బీటెక్‌ పూర్తి చేసింది. 2015లో దేవరకొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీకాంత్‌తో పెళ్లైంది. వివాహ సమయంలో 25 తులాల బంగారం, రూ.4 లక్షలు కట్నంగా ఇచ్చారు. సరూర్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీలో శ్రీకాంత్, నాగలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కుమారుడు చరణ్‌జిత్‌ ఉన్నాడు.

  పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం (Dowry) కోసం నాగలక్ష్మిని భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తుండేవారు. నాగలక్ష్మిని తల్లిగారింటికి, బంధువుల ఇళ్లకు వెళ్లనిచ్చేవాడు కాదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది శనివారం సాయంత్రం నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఆత్మహత్య చేసుకుందని శ్రీకాంత్‌ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

  సూసైడ్‌ నోట్‌..

  భర్త, అత్త, ఆడపడుచుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగలక్ష్మి రాసిన సూసైడ్‌ నోట్‌ (Suicide) పోలీసులకు లభ్యమైంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అల్లుడు తమ కూతుర్ని ఏనాడూ భార్యలా చూడలేదని, అందంగా లేదని (Not such beautiful) సూటిపోటి మాటలతో వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు జనార్ధన్, జయమ్మ తెలిపారు. ఇల్లు కొనేందుకు డబ్బులు కావాలని గొడవ చేస్తూ శాడిస్టులా వ్యవహరించేవాడని వారు వాపోయారు.

  కాగా,  ఇలాంటి ఘటనే హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని గచ్చిబౌలి శివారులో చోటుచేసుకుంది. సునీత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం తీసుకు రావాలంటూ భర్త, అత్త మామలు ఆమెను తీవ్రంగా వేధించారు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించారు. సునీతను భర్త తీవ్రంగా కొట్టేవాడు. ఈ వేధింపులు (Dowry harassment) భరించలేకే సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Dowry harassment, Hyderabad, Wife suicide

  ఉత్తమ కథలు