కోవిడ్ (Covid) భర్తను తీసుకెళ్లిపోయిన మనోధైర్యం మాత్రం కోల్పోలేదు. కట్టుకున్న భర్త అర్దంతరంగా వదిలి వెళ్లిపోయినా ఆమెలో మనో ధైర్యం మాత్రం చెక్కు చెదర్లదు. కూతురుని ఉన్నత చదవులు (Higher studies) చదివించడం కోసం.. ఎప్పుడు అలవాటు లేని స్టీరింగ్ పట్టింది ఆ గృహిణి. భర్త ఉన్న రోజులన్ని అందరిలాగే ఇంటి పనులు చేసుకుంటూ ఉండే ఆవిడ విధి ఆడిన ఆటలో మొండిగా నిల్చోని పోరాటం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆడవాళ్లు పెద్దగా కనిపించని రంగంలో పని చేస్తూ శభాష్ అనిపించుకుంది. ఆమె హైదరాబాద్ కు చెందిన దండు లక్ష్మీ (Dhandu Lakshmi). అసలు ఇంతకి లక్ష్మి ఏం చేస్తుందో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేస్తారు.
హైదరాబాద్ (Hyderabad) లో ఉబెర్ (Uber), ఓలాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికి తెలుసు. అయితే సాధారణంగా మనం ఎక్కడికైనా ట్రిప్ బుక్ చేసుకునేటప్పుడు మనకు చాలా వరకు మగవారు మాత్రమే డ్రైవర్స్ గా వస్తారు. అయితే ఎప్పుడైన మీరు ఉబెర్ (Uber car)బుక్ చేసుకునేటప్పుడు మహిళా డ్రైవర్ వచ్చిందంటే ఆవిడ ఖచ్చితంగా లక్ష్మీనే అని గుర్తించండి. భర్త చనిపోయిన తరువాత కుటుంబ పోషణ కోసం ఉబెర్ డ్రైవర్ గా పని చేస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిస్తోంది హైదరాబాద్ కు చెందిన లక్ష్మి. పిల్లల చదువులు, ఇంటి అద్దె, తనకున్న Xylo వాహనం ఈఏంఐ కోసం ఈ పని చేయక తప్పడం లేదంటారు ఆవిడ.. అయితే తాను చేస్తున్న పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్నానని చెబుతారు లక్ష్మీ.. ఈ రంగంలో చాలా వరకు మహిళలు తక్కువగా ఉండటంతో నన్ను చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నారు. తన వివరాలు చాలా మంది అడిగి తెలుసుకుంటున్నారని అంటున్నారు. తన సెవెన్-సీటర్ వాహనంతో బ్యాక్-టు-బ్యాక్ ట్రిప్పుల నిత్యం ఆమె బిజిగా ఉంటారు.
8-9 గంటల పాటు డ్రైవింగ్..
"నేను గత రెండేళ్లుగా ఉబెర్ డ్రైవర్ గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసిన నా కూతురు ఎంబీఏ సీటు సాధించింది. ఫీజులు చెల్లించి అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నా’’నని ఆమె గర్వంగా న్యూస్ 18కి తెలిపింది. రోజుకి లక్ష్మి 8-9 గంటల పాటు డ్రైవింగ్ చేస్తోంది. దాదాపు రూ. రోజుకు 2,000 వరకు సంపాదిస్తోంది. చాలా మంది ప్రయాణికులు తనని చూసి ఒక మహిళగా ఉండి ఇంత ధైర్యంగా ఈ పని ఎలా చేయగలగుతున్నావు అని అడుతారని అంటారు లక్ష్మీ. తన కుటుంబ పోషణ కోసం ఈ పని తప్ప వేరే మార్గం ఏముందని చెబుతానిని అంటున్నారు.
చాలా మంది కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా ట్రిప్ కు ఎంత డబ్బులో అంతే తీసుకుంటాను తప్ప వాళ్ల దగ్గర ఎక్కువ తీసుకోనని చెబుతారవిడ. వాస్తవానికి ఆమె భర్త మరణానంతరం, భారమంతా తనపై పడింది. కోవిడ్-19కి ముందు లక్ష్మి భర్త ఇంటి బాధ్యతలన్ని చూసుకునేవాడు. అయితే కోవిడ్ -19 మొదటి వేవ్ సమయంలో నా భర్త కు పాజిటివ్ రావడంతో అకస్మాత్తుగా భారం నా పై పడింది. దీంతో ఏం చేయాలో తెలియక అప్పటికే సరదాకోసం నేర్చుకున్న డ్రైవింగ్ అనుభవం ఉండటంతో ఉబెర్లో డ్రైవర్ గా జాయిన్ అయ్యాను. తొలుత కంపెనీ వాళ్లు నేను ఈ పని చేయలేను అనుకున్నారు. కాని సాధారణంగా మగ డ్రైవర్స్ చేసే ట్రిప్స్ కంటే నేను ఎక్కువ చేయడంతో వాళ్లల్లో నమ్మకం వచ్చింది. నాకు కోవిడ్-19 మరణ ధృవీకరణ పత్రం కు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలియదు, కాబట్టి మేం ఎక్స్గ్రేషియాకు అర్హత పొందలేదు ఆమె చెప్పారు. ఇలా డ్రైవర్ గా పని చేస్తూ పిల్లలను చదివించడమే కాకుండా నెలకు 45 వేల రూపాయిల కారు ఈఎంఐ కడుతున్నారు లక్ష్మీ. మీరు ఎప్పుడైనా ఉబెర్ బుక్ చేసుకున్నప్పుడు లక్ష్మీ మీకు డ్రైవర్ గా వస్తే ఆమెను పలకరించడం మర్చిపోవద్దు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Daughters, Hyder Guda, Study, Uber, WOMAN