Home /News /telangana /

Hyderabad Crime News: ఇంటి యజమాని దారుణ హత్య.. ఆమెను చిత్రహింసలు పెట్టి.. బాత్రూంలో దాచి..

Hyderabad Crime News: ఇంటి యజమాని దారుణ హత్య.. ఆమెను చిత్రహింసలు పెట్టి.. బాత్రూంలో దాచి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Crime News: ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి యజమానిని అతి కిరాతకంగా హత్య చేశారు. అంతేకాకుండా విషయం బయటకు తెలియకుండా మృతదేహాన్ని బాత్రూంలో దాచాడు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు యజమానిని చిత్రహింసలు పెట్టినట్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆ వ్యక్తి ఏం ఆశించాడో ఏమో గాని యజమానికి దారుణంగా హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆ శవాన్ని బాత్రూంలో దాచిపెట్టాడు. కొన్ని రోజుల నుంచి ఇంటి యజమాని కనిపించకపోవడంతో యజమాని బంధువులు తెలిసిన వారి ఇంటి వద్ద ఫోన్ చేసి అడిగారు. అయినా ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కాంగారు పడిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యజమాని ఇంటికి వచ్చి పరిశీలించారు. ఇళ్లు మొత్తం వెతికినా ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు. ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తిపై అనుమానం రావడంతో వెల్లి ఆ రూంలో వెతికారు. బాత్రూంలో యజమాని మృతదేహాన్ని గుర్తించారు. ఆ యజమానిని చిత్రంహింసలు పెట్టి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సికింద్రాబాద్‌లో ఇంటి యజమానిని కిరాయికి ఉంటున్న వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అల్వాల్‌లోని హస్మత్‌పేటలో మంగతాయారు (72) అనే వృద్ధురాలికి ఇళ్లు ఉన్నది. ఆ ఇంట్లో సురేశ్‌ అనే వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు. అయితే ఆమెను హత్య చేసి బాత్రూమ్‌లో దాచిపెట్టాడు. కాగా, వృద్ధురాలు కనిపించకుండా పోవడంతో బంధువులు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

    ఈ క్రమంలో కిరాయికి ఉంటున్న సురేశ్‌ ఇంట్లో ఉన్న బాత్రూమ్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే ఆమె హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Veera Babu
    First published:

    Tags: Attempt to murder, Brutally murder, Crime news, Hyderabad crime, Secunderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు