HYDERABAD A RESIDENT OF HYDERABAD VIKRAM RAJU WHO KNOWN AS POP ALBUM CREATOR NOW STRIVES TO PROVIDE VEDIC EDUCATION TO ALL PRV
Pop to Veda: పాప్ ఆల్బమ్ టూ వేదాలు.. కులాలకు అతీతంగా వేద విద్యను అందించడానికి ప్రయత్నిస్తున్న హైదరాబాద్ వాసి..
విక్రమ్ రాజు
ఆయన పుట్టింది ఏపీ అయినా చాలా వరకు విద్యాభ్యాసం విదేశాల్లోను జరిగింది. ఒకప్పుడు దేశంలో పేరోందిన పాప్ ఆల్బమ్ ను రూపొందించిన చేతులే ఇప్పుడు వేద విద్యను నేర్పించడానికి రెడీ అవుతున్నాయి.
ఆయన పుట్టింది ఏపీ అయిన చాలా వరకు విద్యాభ్యాసం విదేశాల్లోను జరిగింది. అయినా అక్కడి సంస్కృతులకు, అలవాట్లుకు గౌరవం ఇస్తూనే మన పురాతన వేదాలకు సంబంధించి ఆసక్తిని పెంచుకున్నారు. ఒకప్పుడు దేశంలో పేరోందిన పాప్ ఆల్బమ్ (Pop album) ను రూపొందించిన చేతులే ఇప్పుడు వేద విద్యను నేర్పించడానికి రెడీ అవుతున్నాయి. వేదాలు (Vedas), ఉపనిషత్తులు అంటే సమాజంలో ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన అంశంగా అందరు భావిస్తారు. కానీ మన పురాతన వేదాలు, ఉపనిషత్తుల్లో ఎంతో సాంకేతికత పొందిపర్చి ఉందని, ఇప్పటి విద్యావిధానంతో పోల్చుకుంటే వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న అంశాల ద్వార పొందుపర్చిన అంశాలతో బోధించే విద్య ఇప్పటి సమాజానికి చాలా అవసరమనే భావనతో హైదరాబాద్ కు చెందిన 40 ఏళ్ల విక్రమ్ రాజు (Vikram raju) వేద విద్యను ఆధునిక అంశాలతో పొందుపర్చి ఇప్పటి పిల్లకు అందించడానికి కృషి చేస్తున్నారు.
ఇండియాన్ వేధిక్ స్కూల్ పేరుతో..
ఇందులో భాగంగా ప్రత్యేకమైన వేధిక్ బోర్డును తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు విక్రమ్ రాజు. యజుర్వేదం, అథర్వవేదంలో పేర్కొన్న శాస్త్ర సాంకేతికత గురించి టీనేజ్లకు బోధించడానికి దాదాపు 8 ఏళ్లు కృషి చేసి ప్రత్యేకమైన సిలబస్ ను రూపోందించారు విక్రమ్ రాజు. ఈ సిలబస్ లో మన పురాణాల్లో ఉన్న అన్ని వేదాల్లో ఉన్న అంశాలు, అప్పటి కళలు, క్రీడాలు, ప్రాచీన యుద్ద కళలను బోధించడం మొదలగు అంశాలను ఆయన పొందుపర్చారు . ఇండియాన్ వేధిక్ స్కూల్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి వేదాలను, ఉపనిషత్తులను ఇప్పటి జనరేషన్ కు చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. మన దేశంతోపాటు ఇతరు దేశాల్లో కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి వేదాలపై సమగ్ర పరిశోధన చేసిన తర్వాత వేదిక్ సిలబస్ తో పాఠశాలను ప్రారంభించాలని విక్రమ్ రాజు నిర్ణయించుకున్నారు .
విక్రమ్ రాజు news 18తో మాట్లాడుతూ.. “నాకు మతపరమైన ఆసక్తి లేదు, అయినప్పటికి మన పురాతన హిందూ గ్రంధాలు, ఇతిహాసాలు, వేదాల గురించి నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది. వేదాలను అర్థం చేసుకోవడం ద్వార ప్రాచీన జ్ఞానాన్ని పొందాలనే తపన నన్ను దేశవ్యాప్తంగా, తమిళనాడు దేవాలయాల నుంచి కశ్మీర్ వరకు బ్రాహ్మణ పండితులను (Brahmans) కలుసుకునేలా చేసింది. నేను వేధాల గురించి చాలా చదివాను. ఈ ప్రక్రియలో యూరోపియన్, ఆసియా దేశాల్లో కూడా పర్యటించి అక్కడ మన వేదాలు ను బోధించే వివిధ యూనివర్శిటీలను కూడా సందర్శించాను అని" తెలిపారు . అయితే విక్రమ్ రాజు వృత్తిరీత్యా బిజినేస్ మేన్ (Business man) అయినప్పటికి వేదాలపై ఆయనకు ఉన్న ఆసక్తి అందులో పూర్తి స్థాయిలో జ్ఞానం సంపాదించేలా చేసింది. అదే జ్ఞానాన్ని (Intelligence) ఇప్పటి తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ వేద పాఠశాలపై కృషి చేస్తోన్నట్లు చెబుతున్నారు.
ఈయన హాలీవుడ్ హారర్ మూవీ రైడ్ 2017 లో నిర్మించారు. హాలీవుడ్ లో పెద్ద హిటైన సాంగ్ ఛాంపియన్ కూడా నిర్మించింది ఆయనే. విక్రమ్ రాజు మాట్లాడుతూ.. ‘‘తిరుమలలో ఒకే రకమైన వేదాలు బోధిస్తారు. మిగిలి పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి దీంతోపాటు ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఈ వేదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాని వేధిక్ స్కూల్ లో మాత్రం సామాజక వర్గంతో సంబంధం లేకుండా ఎవరికైతే వేదాలపై ఆసక్తి ఉంటుందో అందరు వచ్చి నేర్చుకొచ్చు, ప్రస్తుతం వేధిక్ బొర్డు కోసం ట్రై చేస్తున్నాం. అది వచ్చిన తరువాత ఈ సిలబస్ ను అందరికి అందుబాటులో తీసుకొస్తాం’’ అని చెప్పారు.
యుద్ధ కళలను కూడా..
విక్రమ్ రాజు ఏర్పాటు చేయబోయే వేద పాఠశాలలో ప్రాచీన భారతీయ క్రీడలు, జాపత్రి పోరాటం, గట్కా, కలరిప్పయట్టు, సిలంభం వంటి యుద్ధ కళలను కూడా బోధిస్తారు. ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు, వేద గణితం, చక్రాలు, సాంప్రదాయ సంగీతాన్ని వైద్యం చేసే రూపంగా ఉపయోగించే సంగీత చికిత్సపై కూడా ప్రత్యేక తరగతులు ఉంటాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక సంస్కృత అభ్యాస కేంద్రం కూడా రాజు నిర్మించబోయే క్యాంపస్లో భాగంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వేదిక్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తోపాటు ఇటు కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలతో కూడా రాజు సంప్రదింపులు జరుపుతున్నారు అన్ని అనుకూలిస్తే వచ్చే మరో ఆరు నేలల్లో తన ప్రాజెక్ట్ ను పట్టలెక్కస్తా అంటున్నారు విక్రమ్ రాజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.