హోమ్ /వార్తలు /తెలంగాణ /

Students suicide: చెరువులో దూకి తొమ్మిదో తరగతి ప్రేమికుల ఆత్మహత్య.. పూర్తి వివరాలివే..

Students suicide: చెరువులో దూకి తొమ్మిదో తరగతి ప్రేమికుల ఆత్మహత్య.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకే తరగతి కావడంతో వీరిద్దరూ స్నేహంగా వుండేవారు. ఈ స్నేహం మరింత బలపడి ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తెలిసీతెలియని వయసులో కలిగిన ఈ ఆకర్షణనే ప్రేమగా భావించారు. అదే వారి జీవితాలను ముగింపు పలికింది.

ప్రేమ (Love) వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్​ బాలుడు, బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన Hyderabad జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. దర్గయ్య, లలిత దంపతులు కుత్బుల్లాపూర్‌ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి (Ninth class) చదువుతోంది. అదే పాఠశాలలో శివ (Shiva), ఇందిర దంపతుల కుమారుడు (14) 9వ తరగతి చదువుతున్నాడు.  ఒకే తరగతి కావడంతో వీరిద్దరూ స్నేహంగా వుండేవారు. ఈ స్నేహం మరింత బలపడి ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తెలిసీతెలియని వయసులో కలిగిన ఈ ఆకర్షణనే ప్రేమగా భావించారు.కొంతకాలం ఈ మైనర్ల ప్రేమ (Minors love) సాగినా ఎలాగో ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది.  బాలికను తీవ్రంగా మందలించి స్కూల్ మాన్పించిన తల్లిదండ్రులు ఇంటివద్దే వుంచుతున్నారు. దీంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది.

తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి..

ఇక  ప్రేమించిన యువకుడిని కలవాలని మైనర్​ బాలిక భావించింది. ఇలా అదునుకోసం ఎదురుచూస్తున్న బాలికను దగ్గర్లోని అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేసే తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి రావాల్సిందిగా తల్లి పంపింది. ఇదే అదునుగా ప్రేమించిన బాలుడిని కలవడానికి బాలిక సిద్దమయ్యింది. మొదట తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లకుండా బాలుడిని కలిసేందుకు వెళ్లింది. చాలారోజుల తర్వాత కలుసుకున్న ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదు కాబట్టి కలిసి జీవితం ముగిద్దాం అనుకున్నారు. మధ్యాహ్నం సైకిల్ పై ఇద్దరూ కలిసివెళుతూ ఓ స్నేహితుడికి స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు. అక్కడినుండి జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు (Pond) వద్దకు వెళ్ళారు. సైకిల్ అక్కడే పెట్టి, చెప్పులు వదిలి చెరువులో దూకారు.

అయితే రాత్రయినా బాలుడు, బాలిక ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వేరువేరుగా జీడిమెట్ల పోలీసులను ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలో రికార్డయిన పుటేజిని పరిశీలించగా బాలుడు, బాలిక సైకిల్ పై చెరువువైపు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిచూడగా సైకిల్, ఇద్దరి చెప్పులు కనిపించాయి. అయితే చెరువులో వెతకగా బాలిక మృతదేహం లభించింది. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ మాత్రం లభించలేదు.

బాలుడికి ఈత వచ్చు..

అయితే బాలుడికి ఈత వచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. అంటే బాలికతో కలిసి చెరువులో దూకిన తర్వాత ఈతకొట్టుకుంటూ బాలుడు ఒడ్డుకు వచ్చివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ బాలికమాత్రం నీటమునిగి మృతిచెందింది. దీంతో భయపడిపోయి ఎక్కడికయినా పరారయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.

First published:

Tags: Hyderabad, Lovers suicide, Student suicide

ఉత్తమ కథలు