Thief arrested : ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అంటారు. ఇదే తరహలో ఈ దొంగతనం జరిగింది. మనతో ఉన్న వాళ్లే, మనతో తెలివిగా ఉంటూ డౌటు రాకుండా ఇలాంటి పనులు చేస్తు ఉంటారు. నేటి సమాజంలో సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. నిరంతరం కష్టపడి శ్రమించి ఉన్నత స్థితికి ఎదిగేవారు కొందరు అయితే.. దొంగతనాలను, అసాంఘిక కార్యకలాపాలతో డబ్బులు సంపాదించేవారు ఇంకొందరు. ముఖ్యంగా డబ్బుపై ఆశతో తమను ఎంతగానో నమ్మిన వారినే నిట్ట నిలువునా మోసం చేస్తుంటారు. ఇలా మోసం చేసి డబ్బులను, నగలను దొచుకుంటున్న వారు.. ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతున్నారు. ఓ చిన్న తప్పు పోలీసులకు దొరికేలా చేసింది. మరి.. అతను ఎలా దొరికిపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా
ఏడు కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో హైదరాబాద్ నుంచి పరారైన కారు డైవర్ తూర్పుగోదావరిజిల్లాలో పట్టుబడ్డాడు. భూమిలో పాతి పెట్టిన నగలను స్వాదీనం చేసుకున్నారు. కారును కూకట్ ల్లిలో వదిలేసి వరంగల్ జిల్లా వర్సంపేటలోని బందువు ఇంటికి వెళ్లి, యాజమాని రాధిక ఇచ్చిన డెబిట్ కార్డుతో కొత్త ఫోన్ కొనుగొలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికాడు. కొత్త ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారు
హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.7 కోట్ల విలువైన వజ్రాలతో ఉడాయించిన విషయం తెలిసిందే. మాదాపూర్ లో ఉండే రాధిక అనే మహిళ నగల వ్యాపారీ వద్ద శ్రీనివాస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17 అనూష అనే మహిళకు రూ. 50 లక్షల విలువైన వజ్రాభరణాలను ఇచ్చేందుకు రాధిక సేల్స్ మెన్ అక్షయ్ తో కలిసి మధురానగర్ కు కారులో వెళ్లింది. డెలివరీ ఇవ్వాల్సిన రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో ఈ నెల 17న కారుతో శ్రీనివాస్ పరారయ్యాడు. ఈఘటనపై ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, నిందితుడు శ్రీనివాస్ కోసం గాలింపు మొదలుపెట్టారు.
Tirumala: శ్రీవారికి కూడా డిమ్యాట్ అకౌంట్ ఉందనే విషయం తెలుసా.. ఎందుకంటే..
డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేసిన శ్రీనివాస్
కేసు నమోదు చేసిన పోలీసులు కారు నంబరు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వజ్రాలతో ఉడాయించిన శ్రీనివాస్ కారును కూకట్ పల్లి సమీపంలోని మెట్రో మాల్ వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో వదిలి పెట్టాడు. అనంతరం నగల బ్యాగు తీసుకుని రాధిక ఉంటున్న ఫ్లాట్ కి వెళ్లాడు. అక్కడ ఉన్న తన బైక్ ను తీసుకుని పారిపోయాడు. నర్సంపేట్ లో ఉండే బంధువు ఇంటికి వెళ్లాడు. తన వద్ద పాత సెల్ ఫోన్ ఉంటే పోలీసులకు దొరికి పోతానని భావించిన శ్రీనివాస్ కొత్త ఫోన్ కొనేందుకు ప్రయత్నించాడు. కారులో పెట్రోలు కోసం యజమాని రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేసిన శ్రీనివాస్, దానిని అతడి బంధువుకి ఇచ్చి అతడి ఫోన్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బస్సులో తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామం కొవ్వూరు వెళ్లి నగలను గొయ్యి తీసి భూమిలో పాతిపెట్టాడు.
శ్రీనివాస్ కోసం గాలిస్తున్న పోలీసులు.. రాధిక ఇచ్చిన డెబిట్‌కార్డుతో ఫోన్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ కొత్త ఫోన్ ఐఎంఈఐ నంబరు ఆధారంగా శ్రీనివాస్ బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూమిలో పాతిపెట్టిన నగలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించి పూర్తి వివరాలు రాబట్టిన తర్వాత మీడియా ఎదుట హాజరు పరచనున్నట్టు తెలుస్తోంది. కాగా, రూ. 7 కోట్ల విలువైన నగలకు బిల్లులు, లెక్కలు లేకపోవడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Thief Arrested