• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD A MAN COMMITS SUICIDE DUE TO THE HARASSMENT OF HIS MOTHER IN LAW VB

Man commits suicide: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావట్లేదని ఉరేసుకున్న భర్త.. కానీ సూసైడ్ నోట్ లో ఏముందో తెలిస్తే షాక్..

Man commits suicide: పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రావట్లేదని ఉరేసుకున్న భర్త.. కానీ సూసైడ్ నోట్ లో ఏముందో తెలిస్తే షాక్..

ప్రతీకాత్మక చిత్రం

Man commits suicide: వారిద్దరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. కొంత కాలం వరకు ఎలాంటి గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగిపోయింది. ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. తరచూ గొడవలు జరుగుతుండగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

  • Share this:
    వారిద్దరు ఆరేళ్ల క్రితం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. అయితే వారి మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భార్య తన ఇద్దరు కుమారులను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. భార్య కాపారానికి రావడం లేదనే మనస్థాపంతో ఇంట్లో ఉరేసుకొని భర్త ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి గ్రామానికి చెందిన అవ్వారి రాజశేఖర్‌(32) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ల్యాబ్‌ ప్యాకల్టీగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్‌కు గత ఆరు సంవత్సరాల క్రితం మెహదీపట్నంకు చెందిన కన్యాకుమారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే గతకొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

    దీని కారణంగా రాజశేఖర్‌ భార్య తన తల్లిగారి ఇంటికి వెళ్లి పిల్లలతో అక్కడే ఉంటుంది. దీంతో మనస్థాపానికి గురైన రాజశేఖర్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తను అత్తింటి వేధింపులను తట్టుకోలేక చనిపోయినట్లు.. తన చావుకు బావమర్దులు నర్సింహ, శేఖర్‌, అత్త శారదలే కారణమని సూసైడ్ నోట్ రాసి తన జేబులో పెట్టుకున్నాడు.

    husband commits suicide due to no money for wifes delivery in telangana husband commits suicide:భార్య డెలివరీకి డబ్బులు లేకపోవడంతో భర్త ఆత్మహత్య.. విషయం తెసుకున్న భార్య..
    ప్రతీకాత్మక చిత్రం


    తర్వాత చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలను సేకరించారు. ఈ మేరకు మృతుడి తండ్రి మల్లేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు చిన్నాబిన్నం అవుతున్నాయని.. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు