ఒక పెళ్లి(Marriage) సంబంధం చూడాలంటే పెద్దలు ఎంతో ఆలోచించి ముందుకు వేస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న పాటి తేడా వచ్చిన అమ్మాయి తరఫు బంధువులు ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ కూడా చేసుకుంటారు. దీనిలో భాగంగానే ఎన్నారై సంబంధాల విషయంలో అయితే మరింత అప్రమత్తంగా ఉంటారు. అయితే తొందర పడి ఓ అమ్మాయిని ఎన్నారైకి ఇవ్వడానికి సంబంధం కుదుర్చుకున్నారు. నిశ్చితార్థం జరిగిన అనంతరం యువకుడు ప్రవర్తించిన తీరును తట్టుకోలేక యువతి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక ఉరేసుకొని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు అందడంతో వారు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది.
నిశ్చితార్థం జరిగిన అనంతరం యువకుడు యువతిని లొంగదీసుకొని, తద్వారా ఎలా బెదిరింపులకు పాల్పడ్డాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. కార్తీక్‌కు మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజులకు పెళ్లి జరిగేలోపే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో వారి పెళ్లి కూడా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 17న పెళ్లి జరగాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇండియాకు వచ్చిన కార్తీక్.. యువతితో వీడియో కాల్స్‌లో మాట్లాడేవాడు.
నగ్నంగా వీడియోకాల్‌లో మాట్లాడమని ఇబ్బంది పెట్టాడు. కాబోయే భర్తే కదా అని తలవంచి.. అతడు చెప్పిన విధంగా నడుకుకుంది. వీడియో కాల్స్, వాట్సాప్ ద్వారా మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఫోన్‌లో ప్రగతి నగ్న వీడియోలు, ఫొటోలను రికార్డు చేశాడు. ఆరు నెలల కిందట కార్తీక్ స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక కూడా ప్రగతితో చనువుగా తిరిగాడు. కాబోయే భార్యాభర్తలనే ఉద్దేశంతో ఇద్దరు చనువుగా మెలిగారు. కొంతకాలం తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టిన కార్తీక్.. పెళ్లికి బంగారం, నగదుతో పాటు ప్లాట్, భూమి ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిపై పలుమార్లు ఒత్తిడి తెచ్చాడు. మాట్లాడుకున్న కట్నకానుకలు కాకుండా.. అడిగినంత ఇవ్వాలని పట్టుబట్టాడు. లేదంటే తనతో చనువుగా ఉన్న వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.
తాను ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నానని.. వేరే సంబంధమైతే ఇంతకన్నా అధిక కట్నం ఇచ్చేవారని, తాను అడిగినన్ని కట్నకానుకలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ప్రగతి అశ్లీల వీడియోలు, ఫొటోలను బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. చివరికి కట్నకానుకల విషయంలో తేడా వచ్చి రెండు కుటుంబాల వారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కార్తీక్ తన ఫొటోలు, వీడియోలు బయటపెడితే జీవితం నాశనం అవుతుందని భావించిన ప్రగతి అక్టోబర్ 19న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కార్తీక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రగతి, రామ్ కార్తీక్‌ల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించగా ఫొటోలు, వీడియోలు, కార్తీక్ బ్లాక్‌మెయిల్ విషయం వెలుగు చూసింది. ప్రగతి ఆత్మహత్యకు రామ్ బ్లాక్ మెయిల్ కారణమని నిర్ధారించిన పోలీసులు అతడతిపై సెక్షన్ 306 కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: After marriage, Crime, Crime news, Telangana, Telangana crime