హోమ్ /వార్తలు /తెలంగాణ /

Terror Attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్ర.. RSS, బీజేపీ నాయకుల ఇళ్లే టార్గెట్ గా..

Terror Attack: హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్ర.. RSS, బీజేపీ నాయకుల ఇళ్లే టార్గెట్ గా..

పాతబస్తీ ప్రాంతం

పాతబస్తీ ప్రాంతం

Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్రధానంగా RSS, BJP నాయకుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ అనే వ్యక్తి కుట్రకు పూనుకున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ప్రధానంగా RSS, BJP నాయకుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ అనే వ్యక్తి కుట్రకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆరుగురు యువకులను రిక్రూట్ చేశారు. అలాగే జాహిద్ కు పలు టెర్రర్ గ్రూపులతో లింక్ లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జాహిద్ ను  అదుపులోకి తీసుకున్నారు.

  జాహిద్ అనే వ్యక్తి 2005న హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బాంబు పేలుడు కేసులో నిందితునిగా ఉన్నాడు. దానికి సంబంధించి కేసును 2017లో కొట్టివేశారు. అయితే కొంతకాలంగా టెర్రర్ యాక్టివిటీస్ కు దూరంగా ఉన్న జాహిద్ తాజా కుట్ర కోణంలో భాగమయ్యాడని తెలుస్తుంది. కాగా గతంలో మక్కా మసీద్ పేలుళ్ల ఘటనలో కూడా జాహిద్ ను పోలీసులు ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం జాహిద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు.

  దీనికి సంబంధించి పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. జాహిద్ కు పాకిస్థాన్ కు చెందిన ISI తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది. దసరా ఉత్సావాలె టార్గెట్ గా వీరు కుట్ర పన్నినట్లు సమాచారం. సమియుద్దీన్, ఫారూఖ్ తో కలిసి జాహిద్ ఈ కుట్ర పన్నాడు. జాహిద్ కు సహకరించిన మరో ముగ్గురు పరారీ అయ్యారు. జాహిద్ నుండి 2 గ్రెనైడ్ లు, రూ.4 లక్షలు సమియుద్దీన్ వద్ద గ్రెనైడ్, రూ.లక్షా యాభై వేలు, ఫారూఖ్ నుండి 2 గ్రెనైడ్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి పాకిస్థాన్ నుండి గ్రెనైడ్ లను టెర్రరిస్టులు పంపించినట్టు తెలుస్తుంది.

  Published by:Paresh Inamdar
  First published:

  Tags: Crime news, Hyderabad, Telangana News

  ఉత్తమ కథలు