హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..1419 మంది బాధిత అమ్మాయిలకు విముక్తి

హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు..1419 మంది బాధిత అమ్మాయిలకు విముక్తి

హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ (Hyderabad) లో భారీ సెక్స్ రాకెట్ ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. అంతర్జాతీయ ముఠాకు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరు డ్రగ్స్ సప్లై చేస్తూ..యువతులను, మహిళలను సెక్స్ రాకెట్ లో దించుతున్నట్టు పోలీసులు తెలిపారు.  మొత్తం 15 నగరాల నుండి యువతులను రప్పించిన నిందితులు వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడిలో 1419 మంది అమ్మాయిలను గుర్తించి వారికి విముక్తి కల్పించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ (Hyderabad) లో భారీ సెక్స్ రాకెట్ ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. అంతర్జాతీయ ముఠాకు చెందిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరు డ్రగ్స్ సప్లై చేస్తూ..యువతులను, మహిళలను సెక్స్ రాకెట్ లో దించుతున్నట్టు పోలీసులు తెలిపారు.  మొత్తం 15 నగరాల నుండి యువతులను రప్పించిన నిందితులు వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడిలో 1419 మంది అమ్మాయిలను గుర్తించి వారికి విముక్తి కల్పించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ దందాలో మొత్తం 39 మంది ప్రమేయం ఉంది. వీరు వెబ్ సైట్ యాడ్స్ ద్వారా బాధితులను కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఈ దందాలో విదేశీ మహిళలను సైతం దించినట్లు సీపీ తెలిపారు.

Good News: హైదరాబాద్ వాసులకు కేటీఆర్ గుడ్ న్యూస్..ఎల్బీనగర్-హయత్ నగర్ మెట్రో పొడిగింపుపై కీలక ప్రకటన

30 శాతం బాధితులకు..35 యాడ్స్..35 నిర్వాహకులకు..

ఈ దందాలో ఇతర రాష్ట్రాల నుండి యువతులను రప్పించారు. ఏపీ, తెలంగాణ , కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై, పశ్చిమ బెంగాల్ , కోల్ కతాకు చెందిన బాధితులు ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్, నేపాల్, రష్యాకు చెందిన యువతులు కూడా ఉన్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే వ్యభిచారం ద్వారా వచ్చిన నగదుతో 30 శాతం బాధితులకు, మరో 35 శాతం వెబ్ సైట్ యాడ్స్, మిగిలిన 35 శాతం నిర్వాహకులు తీసుకుంటున్నారని చెప్పారు.

ఫ్లాష్..ఫ్లాష్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఏసీబీ కోర్టులో పోలీసులకు చుక్కెదురు

ఆర్నావ్ కీలక నిందితుడు..

ఈ సెక్స్ రాకెట్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ప్రధాన నిందితునిగా ఉన్నాడు. 1419 మంది అమ్మాయిల్లో 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్ కతా నుండి సప్లై చేసినట్టు గుర్తించారు. కాగా సమీర్ అనే వ్యక్తి అనంతపురం , కరీంనగర్ , హైదరాబాద్ కేంద్రాలుగా ఈ రాకెట్ నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో 950 మందితో వ్యభిచారంతో పాటు డ్రగ్స్ దందా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆ యువతులే టార్గెట్..

సోమాజిగూడలోని ఓ ప్లాట్ లో ఆర్నావ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉద్యోగాలు లేని యువతులు, పేదరికంలో వున్న మహిళలే లక్ష్యంగా ఈ వ్యభిచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరంతా గ్రూపులుగా విడిపోయి దందా నడిపిస్తున్నారు. అయితే ఇందులో హోటల్ లో పని చేసే వారికి కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అందరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First published:

Tags: Crime, Crime news, Hyderabad, Telangana

ఉత్తమ కథలు