వికాస్ జాదవ్, సుభాష్‌కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో చెకింగ్ పాయింట్స్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేశారు.
మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు . తాజాగా విశాఖ, ఒడిశా ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు (Smugglers was arrested by Hyderabad police). వారి వద్ద నుంచి రూ.21వేల నగదు, 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర (Maharashtra) నాసిక్‌కు చెందిన వికాస్‌జాదవ్, ఒడిస్సా, మోహిపాల్పుట్కు చెందిన సుభాష్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్‌కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్‌సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్‌కు గంజాయి (ganja) అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్‌లో సుభాష్‌కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి (cannabis) కొనుగోలు చేసి అశోక్‌కూలే, అమోల్‌కు అప్పగించేవాడు. వారు విలాస్జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్‌కు గంజాయి తరలించేవారు.
మహారాష్ట్రకు సరఫరా చేయాలని..
వారం రోజుల క్రితం వికాస్ జాదవ్, సుభాష్‌కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ (Hyderbad) మీదుగా మహారాష్ట్రకు సరఫరా (Transport) చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్‌కూలే, అమోల్‌కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్‌కుమార్ సింగ్‌లకు ఫోన్ చేసి తమ ప్లాన్‌ను వివరించారు. ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని (ganja) ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు.
ఈ నెల 19న అశోక్‌కూలే, రాహుల్‌కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం (Ginger) సంచులను లోడ్ చేశారు.
తప్పించుకోవడానికి ఎత్తుగడ..
తెలంగాణలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్ కొనసాగతుండటం, ఓఆర్ఆర్ టోల్గేట్ల వద్ద టోల్ రుసుముతో పాటు చెకింగ్ పాయింట్స్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేశారు. నగరంలో నుంచి గూడ్స్ లారీ మాదిరిగా వెళ్లడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డీసీఎం వ్యాన్ మియాపూర్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు.
కారులో ఉన్న అశోక్‌కూలే, రాహుల్కుమార్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా డీసీఎంలో 800 కిలోల గంజాయిని నాసిక్‌కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అశోక్‌కూలే, అమోల్, రాహుల్‌కుమార్ సింగ్, విలాస్జగనాథ్, ఫీరోజ్ మోమిన్, సుధామ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు వికాస్‌జాదవ్, సుభాష్‌కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటున్నామని సీపీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. డీసీఎం, గంజాయి సహా పట్టుకున్న సొత్తు విలువ రూ.1.80 కోట్లు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.