హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh laddu: రికార్డులు బ్రేక్​.. హైదరాబాద్​లో 60 లక్షలు పలికిన గణేశ్​ లడ్డూ.. 

Ganesh laddu: రికార్డులు బ్రేక్​.. హైదరాబాద్​లో 60 లక్షలు పలికిన గణేశ్​ లడ్డూ.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేష్ లడ్డూ వేలం పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. బాలాపూర్ లడ్డూను అల్వాల్ లడ్డూ బ్రేక్ చేసింది. అల్వాల్ లడ్డూ రికార్డును తాజాగా మరో లడ్డూ బద్దలు కొట్టింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్ (Hyderabad)​ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేష్ లడ్డూ (Ganesh Laddu) వేలం పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. బాలాపూర్ లడ్డూను అల్వాల్ లడ్డూ బ్రేక్ చేసింది. అల్వాల్ లడ్డూ రికార్డును తాజాగా బండ్లగూడ లడ్డూ (Bandlaguda laddu) బద్దలు కొట్టింది.ఈ వేలం పాటలో (Auction)  రూ. 60..08 లక్షలు పలికింది లడ్డూ. ఇవాళ బండ్లగూడ కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం వేశారు. ఈ వేలం పాటలో రూ. 60..08 లక్షలు పలికింది లడ్డూ. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇదే రికార్డుగా చెబుతున్నారు.

  హైదరాబాద్‌ (Hyderabad)లో ఏటా గణేశ్​ ఉత్సవాలు (Ganesh Chaturthi ) అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది చాలా వరకు విగ్రహాలకు శుక్రవారం నిమజ్జనోత్సవం జరిగింది. మిగిలిపోయిన గణపతులను శనివారం హుస్సేన్ సాగర్‌ (Hussain sagar)లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో గణేశ్​ లడ్డూ వేలం పాటలు జరుగుతున్నాయి. తాజాగా ఈ వేలం పాటలో రూ. 60..08 లక్షలు పలికింది బండ్లగూడ లడ్డూ.

  ఆల్వాల్ లోని కనాజిగూడ మరకత గణేశ్ లడ్డూ (Kanajiguda Marakata Ganesh Laddu) వేలం.. బాలాపూర్​ లడ్డూ రికార్డును బ్రేక్​ చేసింది. శనివారం జరిగిన వేలం పాటలో ఇక్కడి లడ్డూ రూ.46 లక్షలు పలికింది. రూ. 45,99,999కి లడ్డూని వెంకట్ రావు అనే వ్యక్తి దక్కించుకున్నారు.

  Telangana : గణేష్ ఉత్సవాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం ..శోభయాత్ర, నిమజ్జనంలో ముస్లిం సోదర, సోదరీమణులు

  బాలాపూర్‌ లడ్డూ (Balapur laddu) కూడా వేలంలో భారీ ధర పలికింది. బంగారు లడ్డూను వ్యాపారి వంగేటి లక్ష్మారెడ్డి(Vangeti Lakshmareddy) దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో 24 లక్షల 60వేల(24 lakhs 60 thousand)కు లడ్డూను దక్కించుకున్నారు. 29సారి జరిగిన వేలంలో లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డికి అందజేసారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష్మారెడ్డి. లడ్డూ వేలం అనంతరం భారీ గణనాథుడి శోభయాత్రను ప్రారంభించారు. లడ్డూ వేలంలో గతంలో పాల్గొన్న వారితో పాటు మరో 9మంది కొత్తగా ఈ వేలంలో చేరారు.

  ఇప్పటి వరకు 28ఏళ్లుగా బాలాపూర్‌ లడ్డూని వేలం వేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్య గతేడాది కాస్త తక్కువ ధర పలికినప్పటికి ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వేలం జరింది. మొట్టమొదటి సారిగా 1994 నుంచి బాలాపూర్‌లో గణేష్‌ లడ్డూ వేలంపాట కొనసాగూ వస్తోంది. బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Ganesh Chaturthi​ 2022, Hyderabad

  ఉత్తమ కథలు