Home /News /telangana /

HYDERABAD A FIRE BROKE OUT AT THE GREEN BAWARCHI HOTEL IN HYDERABAD AND 20 PEOPLE ARE SUSPECTED TO BE TRAPPED INSIDE THE BUILDING PRV

Fire accident on Hotel: హైదరాబాద్​లో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 20 మంది.. రక్షించాలంటూ హాహాకారాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

    హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. గ్రీన్ బావర్చి హోటల్‌ (Green Bawarchi Hotel)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

    భవనం లోపల 20 మంది?

    ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.  గ్రీన్‌ బవార్చి హోటల్‌లో ఐమాక్‌ ఛాంబర్‌లోని 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటల కారణంగా బిల్డింగ్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. కాగా, భవనం లోపల 20 మంది చిక్కుకున్నట్టు (trapped inside the building) తెలుస్తోంది. బాధతులు తమను రక్షించాలంటూ భవనం పై నుంచి కేకలు వేస్తున్నారు. ప‍్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భారీ క్రేన్‌లో సాయంతో రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.  భవనం పైనున్నవారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్‌ను పంపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    పాతబస్తీ చార్మినార్ సమీపంలో..

    హైదరాబాద్ లో గురువారం ఇలాంటి అగ్నిప్రమాదమే సంభవించింది. హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం చారిత్రకప్రాధాన్యత కలిగి ఉండడంతో.. పర్యాటకుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది. ఇక చార్మినార్ పక్కనుండే లాడ్ బజార్.. ఇరుకు గల్లీలు.. చిన్న చిన్న షాపులు.. కిక్కిరిసిన జనాలతో నిండి ఉంటుంది. అలా లాడ్ బజార్ లో ఉన్న ఓ రెండస్తుల భవనంలో బట్టల షాపు బిజీగా ఉంది. అయితే, అనుకోకుండా ఆ బట్టల షాప్ లో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో షాప్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో షాప్ లోని బట్టలతో పాటు ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి.

    అగ్ని ప్రమాదం మీద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాప్ లో ఏమీ మిగలకుండా అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన బట్టల షాప్ ను స్థానిక పోలీసులు పరిశీలించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని... ఆస్తి నష్టంతో పాటు ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Fire Accident, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు