Home /News /telangana /

HYDERABAD A FATHER CONTACTED THE DETECTIVES ONLINE TO FIND OUT THE DETAILS OF THE GROOM BUT THEY TOOK ONE LAKH RUPEES AND CHEATED HIM PRV

Detective frauds: వరుడి వివరాలు తెలుసుకోవడానికి డిటెక్టివ్​లను సంప్రదించిన తండ్రి.. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు పెద్దలు. ఇలా కూతురు క్షేమం కోసం సద్గుణాలు ఉన్న అల్లుడు కావాలని కోరుకున్నాడు ఓ తండ్రి. ఆ ప్రాసెస్​లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.

    పెళ్లంటే (marriage) అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలంటారు పెద్దలు. ఇలా కూతురు క్షేమం కోసం సద్గుణాలు ఉన్న అల్లుడు కావాలని కోరుకున్నాడు ఓ తండ్రి (father). అయితే ఆ తండ్రి అరవై ఏళ్లు దాటడంతో బయటకి వెళ్లడం కష్టమైపోయింది. అయితేనేం ఇదేమో ఇంటర్నెట్​ యుగమాయే. ప్రతీ పనికి ఓ ఏజెన్సీ పుట్టుకొచ్చింది. దీంతో గూగుల్‌ (Google) సెర్చ్‌లో ఓ డిటెక్టివ్‌ ఏజెన్సీ (Detective Agency)ని సంప్రదించాడు ఆ తండ్రి. అయితేగూగుల్‌లో కాల్‌ సెంటర్ల నెంబర్లే కాదు.. వివిధ సంస్థలూ బోగస్‌వి ఉంటున్నాయి. దీంతో మోసపోవడం ఆ తండ్రి వంతైంది. రాజధాని నగరం హైదరాబాద్​లోని (Hyderabad) అత్తాపూర్‌కు చెందిన బాధితుడు (62) ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన కుమార్తె (daughter)కు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్‌ (Matrimonial) వెబ్​ సైట్స్‌లో వివరాలు రిజిస్టర్‌ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి (Groom) పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు.

    ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని..

    ఆ తండ్రికి వయసు రీత్యా తిరగడం కష్టం. అయితే ఆధునిక ప్రపంచం ప్రతీ పనికి ఓ ఏజెన్సీ పుట్టుకొచ్చిన రోజులు కావడంతో.. దీనికోసం ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్‌ (Searched in Google) చేశారు. అందులో కనిపించిన నెంబర్‌ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉందని చెప్పారు తండ్రికి.



    వెరిఫికేషన్‌ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్వాన్సుగా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్‌ నెంబర్‌ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు.

    Orphanage: మట్టిలో మాణిక్యం.. పుట్టిన ఊరిలో రూ. 7 కోట్ల‌తో ఆనాథాశ్ర‌మం నిర్మించిన ఎన్ఆర్ఐ.. 

    సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి. బాధితుడు నివసించే అత్తాపూర్‌లోని (Athapur) అపార్ట్‌మెంట్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్‌ 9ACP Prasad)కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ (Cyberbad cyber crime) ఠాణాకు బదిలీ చేయనున్నారు పోలీసులు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Arrange marriage, Cheating, CYBER FRAUD, Father, Hyderabad

    తదుపరి వార్తలు