Home /News /telangana /

HYDERABAD A FATHER COMMITS SUICIDE AFTER HIS SON DIED CAUSE OF HEALTH PROBLEM THIS SAD INCIDENT HAPPENED IN HYDERABAD PRV

Sad Incident: అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి.. కొడుకు లేడనే విషయం తట్టుకోలేక ఆ తండ్రి ఎంత పని చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య సమస్యలు తీవ్రం అవ్వడంతో.. కొడుకు మరణించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తనయుడి మృతిని లక్ష్మణ్‌ జీర్ణించుకోలేకపోయాడు.

కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయితే విధి ఆడిన వింత నాటకంలో కొడుకును తీసుకెళ్లింది. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి ప్రాణాలు తీసుకోవడం (Suicide) చర్చనీయాంశమైంది. హైదరాబాద్​లోని (Hyderabad) జవహర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్​లోని స్థానిక అంబేడ్కర్​ నగర్‌లో భార్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని తనయుడు (Son) గత కొంతకాలంగా మూర్చవ్యాధితో సతమతమవుతున్నాడు. ఆరోగ్య సమస్యలు తీవ్రం అవ్వడంతో.. గురువారం మరణించాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న తనయుడి మృతిని లక్ష్మణ్‌ జీర్ణించుకోలేకపోయాడు. బిడ్డ లేకుండా తాను బ్రతకలేనంటూ (Without son) మనసులో కుమిలిపోయి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇంట్లోనే ఉరేసుకుని (hanging himself) తనువు చాలించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్క రోజు వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర నైరాశ్యం నెలకుంది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అంబేద్కర్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఖమ్మంలో ఇలాంటి ఘటనే..

కాగా, ఇటీవల ఖమ్మంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఖమ్మం జిల్లా(Khammam District) సత్తుపల్లిలో(Sattupalli) చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెండ్రోజుల వ్యవధిలో కొడుకు, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని వేంసూరు రోడ్‌కు చెందిన చల్లా రాంబాబు (45), కృష్ణవేణి దంపతులకు భానుప్రకాష్‌ (16), కుసుమ సంతానం. ఈ రాంబాబు కుటుంబం ఖమ్మంలో నివాసం ఉంటోంది. ఖమ్మం లోని మమత హాస్పిటల్ రోడ్ లో ఉన్న హార్వెస్ట్ స్కూలు లో భాను ప్రకాష్ పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న స్నేహితులతో కలిసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల విషయమై భాను ప్రకాష్ ను పాఠశాల యాజమాన్యం, మందలించారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసింది. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు.

దీంతో అతడిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న సాయి మృతిచెందాడు. స్వగ్రామం సత్తుపల్లిలో కుమారుడి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం రాంబాబు నిన్న రాత్రి 11గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఈ ఉదయం కుమారుడిని ఖననం చేసిన ప్రాంతంలోనే చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Attemp to suicide, Father died

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు