Home /News /telangana /

HYDERABAD A DOG HOLDING A BOY HEAD IN ITS MOUTH AND WALKING IN THE LB NAGAR AREA OF HYDERABAD CREATED A SENSATION PRV

Boy head in Dog mouth: హైదరాబాద్​లో కలకలం.. బాలుడి తలను ఎత్తుకెళుతున్న కుక్క.. రంగంలోకి పోలీసులు 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ పాల దుకాణంలో కూర్చుని ఉన్నాడు కార్తిక్​. ఈ క్రమంలో ఓ కుక్క అటు పక్కనుంచి వెళ్లడం చూశాడు కార్తిక్​. అయితే కుక్క ఏదో తీసుకెళుతుందని తీక్షణంగా గమనించాడు. దీంతో కళ్లు బైర్లు కమ్మాయి కార్తిక్​కు.

    హైదరాబాద్ (Hyderabad) వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడి (boy head) తల కనిపించడంతో కలకలం రేగింది. ఎల్బీనగర్‌ (LB Nagar) పరిధిలోని మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో బాలుడి తల (Boy head)ను కుక్క నోటకరుచుకుని ( A dog holding a boy's head in its mouth)వెళ్లడం స్థానికులు  గమనించారు . వెంటనే కుక్కను వెంబడించగా... బాలుడి తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి కుక్క పారిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీంను రంగలోకి దింపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

    ఏం జరిగింది..?

    హైదరాబాద్​ నగరంలోని ఎల్బీనగర్‌ (LB Nagar)కు చెందిన కార్తీక్‌.. ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో ఓ పాల దుకాణంలో కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కుక్క అటు పక్కనుంచి వెళ్లడం చూశాడు కార్తిక్​. అయితే కుక్క ఏదో తీసుకెళుతుందని తీక్షణంగా గమనించాడు. దీంతో కళ్లు బైర్లు కమ్మాయి కార్తిక్​కు. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం (Boy head in Dog mouth) గమనించాడు.

    ఒక్కసారిగా తేరుకుని వెంటనే కుక్కను వెంబడించగా.. తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి పారిపోయింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్1 దగ్గర జరిగింది. కాగా, విషయాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి తల (Boy head)ను స్వాధీనం చేసుకున్నారు. బాలుడి తలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. శిశువు తలను కుక్క ఎక్కడ నుంచి తెచ్చింది అనే విషయంపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొద్దిరోజుల్లోనే దారుణానికి  (Boy head in Dog mouth) కారణమైన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

    అయితే బాలుడిని నరబలి ఇచ్చారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలె ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

    నల్గొండ జిల్లా సంచలనం సృష్టించిన జైహింద్ నాయక్ అనే మతిస్థిమితం లేని వ్యక్తినిని హత్య చేసి తల మొండెం వేరు చేశారు. తలను జిల్లాలోని చింతపల్లి మండలం నాగార్జున సాగర్ ,హైదరాబాద్ జాతీయ రహదారీ సమీపంలోని విరాట్‌నగర్ కాలనీలోని మెట్టు మహాంకాళీ ఆలయం అమ్మవారి వద్ద మొండెల లేని తలను పెట్టారు. కాగా ఈ విషయం సంచలనంగా మారింది. ముందుగా మొండెం తల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

    ఆ ఆలయం చుట్టు ఎలాంటీ సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మొత్తం 70 మంది పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మొండెం ఆచూకి కోసం వెతికారు.. కాగా మూడు రోజుల క్రితం లభించిన తలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పరిచారు. ఈ క్రమంలోనే పోలీసు బృందాలు మొండెం ఆచూకి కోసం వెతుకున్నా నేటి సాయంత్రం వరకు ఆచూకి లభించలేదు.

    అయితే తల లేని మొండెం కోసం తుర్కయాంజల్ ప్రాంతలోని వందల కిలోమీటర్ల వరకు ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరీశీలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే చివరకు మొండెం మాత్రం మరో జిల్లాలో లభ్యమయింది. తల నల్గొండ జిల్లాలో లభ్యం కాగా మొండెం మాత్రం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఓ భవనంపై జైహింద్ నాయక్ మొండెం లభించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Dog, Hyderabad, Murder, School boy

    తదుపరి వార్తలు