అందరికీ కలలుంటాయి. కొందరు వాటిని చేరుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు. అదే కోవకు చెందిన వాళ్లు ఈ సింగపూర్ (Singapore)కు చెందిన రవి మంత, కవిత జంట. ఇద్దరికి మంచి ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు.. విదేశాల్లో నివాసాలు. అయినా ఎందుకో ఆ జంటకు అవి పెద్ద కిక్కు ఇవ్వలేదు. అందుకే వాటిని వద్దనుకొని సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి.. ఇక్కడ భూమిని కొనుగోలు చేసి ఒక చిన్న సైజ్ ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేశారంటే మీరు ఆశ్చర్యపోతారు.
కవిత (Kavita) లండన్‌లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లో MBA పూర్తి చేశారు. ఇక రవి రచయిత, పబ్లిక్ స్పీకర్, రాజకీయ సలహాదారుగా వివిధ స్థానాల్లో పనిచేశారు. యునైటెడ్ స్టేట్స్, యూకే, సింగపూర్‌లో 15 సంవత్సరాలు విదేశాల్లో నివసించారు. ఉద్యోగ రీత్య వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఈ జంటకు ఏవీ కూడా పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో ఐదేళ్ల క్రితం భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కవిత, రవి మంత ఈ జంట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి (Shankarpalli)లో 17 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ స్థలం ఒక చిన్న సైజ్ ఫుడ్ ఫారెస్ట్‌ను తలపిస్తోంది. ఈ దంపతులు (Couple) భూమిని కొనుగోలు చేసినప్పుడే ఒక ఆర్గానిక్ స్టోర్‌ను కూడా కొనుగోలు చేశారు. తమ 17 ఎకరాల్లో పండించిన వాటిని ఇదే స్టోర్ లో సేజ్ సస్టైనబుల్ లివింగ్ అనే పేరుతో ఆర్గానిక్ పళ్లు, కూరగాయలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ జంట పెర్మాకల్చర్, కొరియన్ సహజ వ్యవసాయం, బయో-డైనమిక్స్ సూత్రాలను అనుసరించి ఈ పొలంలో 50 కంటే ఎక్కువ రకాల కూరగాయలు, ఆకు కూరలు, 15 రకాల పండ్లు, పప్పులు, ధాన్యాలు మొదలైనవి పండిస్తున్నారు (Organic farming).
పిచ్చి పట్టిందని అనుకున్నారు.
పొలంలో తేనెటీగలు, పశువులు, సీతాకోక చిలుకలు, తూనీగలు, వానపాములు, పుట్టలు వంటి అన్ని రకాల జీవులను పెంచుతున్నారు. ‘‘ తొలుత మేం ఇలా ఉద్యోగాలు మానేసి వ్యవసాయం (Organic farming) చేస్తాం అంటే చాలా మంది వ్యతిరేకించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాకు పిచ్చి పట్టిందని అనుకున్నారు. లక్షల్లో జీతాలు, మంచి ఉద్యోగాలు వదిలేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నాం అని అందరు అనుకున్నారు. కాని మేం చేసింది బలంగా నమ్మం. సేంద్రియ వ్యవసాయం (Organic farming) అనే కాన్సెప్ట్ మార్కెటింగ్ జిమ్మిక్ అనుకునే వారికి ఇప్పుడు మా ప్రయాణం చాలా స్పూర్తినిస్తోంది. ఈ రోజు చాలా మంది మేం నిర్మించిన ఫారెస్ట్ (Organic farming) ను చూడటానికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఐదేళ్ల క్రితం చాలా ఇష్టంతో ప్రారంభించిన మా ప్రయాణం ఇప్పుడు ఒక లైఫ్‌గా మారిందని న్యూస్ 18 కి తెలిపారు ఈ జంట.
“ ప్రస్తుతం మేం క్రియేట్ చేస్తోన్న ఫారెస్ట్ లో మీరు పండ్లను ఎటువంటి సంకోచం లేకుండా తినవచ్చు . ఎందుకంటే ఇక్కడ అన్ని కూరగాయాలు, పళ్లు మేం రసాయనాలు వాడకుండా పడిస్తున్నాం (Organic farming). ఇక్కడ పండించే కూరగాయాలు, పళ్లకు సంబంధించిన విత్తనాలను మేం విత్తన బ్యాంకుల నుంచి సేకరించిన దేశీయ విత్తనాలను ఉపయోగిస్తాం. ఇక్కడ పండించే వాటిలో 100 శాతం ప్రాసెస్ చేయబడి మేం రస్ చేస్తోన్న ఆర్గానిక్ స్టోర్‌లో అమ్ముతతాం”అని తెలిపారు రవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Organic Farming, Rangareddy