Home /News /telangana /

HYDERABAD A COUPLE FROM RAMANTAPUR COMMITTED SUICIDE FOUR MONTHS AFTER THEIR LOVE MARRIAGE DUE TO FINANCIAL DIFFICULTIES PRV

Couple suicide: వాళ్లిద్దరూ పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, పెళ్లైన నాలుగు నెలలకే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని హైదరాబాద్​ నగరంలో కాపురం పెట్టిన ఓ యువజంట అర్ధంతరంగా జీవితం ముగించారు. పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకుని ప్రేమను గెలిచినా జీవితాన్ని గెలవలేకపోయారు.

    ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కాపురం పెట్టిన ఓ యువజంట అర్ధంతరంగా జీవితం ముగించారు. పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకుని ప్రేమను (Love) గెలిచినా జీవితాన్ని గెలవలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అసువులు బాశారు (Committed suicide). హైదరాబాద్​ నగరంలోని రామంతాపూర్‌ (Ramanthapur) శ్రీనగర్‌ కాలనీకి చెందిన కొత్త సాయిగౌడ్‌ (30), మీర్‌పేటకు చెందిన సందూర్‌ నవనీత (28)కు మౌలాలిలో ఉన్న సూపర్‌ మార్కెట్‌లో పరిచయమైంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీరి వివాహానికి (marriage) ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సాయిగౌడ్, నవనీత ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుని రామంతాపూర్‌లోని శ్రీనగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో (Rented house) కాపురముంటున్నారు. నవనీత ప్రైవేట్‌ కాల్‌ సెంటర్‌ (call center)లో పని చేస్తుండగా సాయిగౌడ్‌ పెస్ట్‌ కంట్రోల్‌ ఉద్యోగం (Job) చేసేవాడు. కొంత కాలంగా సాయిగౌడ్‌ ఉద్యోగం పోయి మద్యానికి (Alcohol) బానిసయ్యాడు.

    ఓ వైపు ఉద్యోగం పోయిన బాధ, మరోవైపు సాయం చేసే వారులేక ఆర్థిక స్తోమత సహకరించక సాయిగౌడ్​, నవనీతలు కుంగిపోతుండేవారు. ఇదే క్రమంలో సాయిగౌడ్‌  తరుచూ మద్యం తాగి ఇంటికి వస్తుండటంతో దంపతుల (Couple) మధ్య  గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఇదే విషయాన్ని నవనీత తన తల్లిదండ్రులకు చెబుతుండేది. అయితే శుక్రవారం సాయంత్రం నుంచీ నవనీత సోదరుడు నవీన్‌ ఫోన్‌ చేస్తున్నా కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు.

    సోదరుడు వచ్చి చూడగా..

    రామంతాపూర్‌లోని సోదరి ఇంటికి నవీన్‌ శనివారం ఉదయం వచ్చి చూడగా సాయిగౌడ్, నవనీత చనిపోయి (Suicide) కనిపించారు. నవీన్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి వచ్చారు. మొదట నవనీత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు, ఆ తర్వాత ఆమె చున్నీతో సాయిగౌడ్‌ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

    క్షణికావేశంలోనే ఘటనలు..

    క్షణికావేశం ఇలా ప్రాణాలను బలి తీసుకుంటుంది.  ఇటీవలె ఓ ప్రేమజంట తమ పెళ్లికి పెద్దలు అంగీకరించబోరనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు.  ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య (love couple committed suicide) చేసుకుంది. ఈ సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా గేట్ వనంపల్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్ పేట మండలం కడ్చర్ల గ్రామానికి చెందిన పల్లె యాదయ్య కుమారుడు పవన్ (18), ఓ యువతితో కలిసి ఔరంగాబాద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు ధారూర్ మండలం ఎబ్బనూరు గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. హైదరాబాద్ కొంపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి మైనర్ కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అనే భయంతో ఆత్మహత్య (Lovers suicide) చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Couple died, Crime news, Hyderabad, Love marriage

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు