సాధారణంగా మన ఇంట్లో చెత్త (garbage)ను ఏం చేస్తాం.. ఏముంది రోజు విడిచి రోజు చెత్తవాడు వస్తాడు వాడికి ఇచ్చేస్తాం.. నెలకి వాడు చెత్త తీసుకొని వెళ్లడానికి ఎంతో కొంత ఇస్తాం అదే కదా మీ సమాధానం. అయితే మీ ఇంట్లో చెత్త తీసుకుని వెళ్లడానికి మీరు డబ్బులు ఇవ్వకుండా మీకే డబ్బులిచ్చి (Pay money) మీ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లత్తే ఎలా ఉంటుంది? బాగుంది కదూ? సరిగ్గా ఇదే పని చేస్తోంది జైపూర్‌కు చెందిన ఎకోవ్రాప్ అనే స్టార్టప్, ఉచిత స్మార్ట్ డస్ట్‌బిన్‌లను (Smart dutbins) పంపిణీ చేయడం వాటిల్లో చెత్త నిండిన తరువాత కొంత డబ్బులు చెల్లించి ఆ చెత్తను తీసుకెళుతున్నారు. ఈ స్టార్ట్ ప్ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) లో తమ సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ స్టార్టప్ ను అంగ్ రాజ్ స్వామీ 2017 లో జైపూర్లో (Jaipur) మొదట తన స్నేహితుల ఇళ్లల్లో ప్రారంభించాడు. అక్కడ మంచి స్పందన రావడంతో ఇదే ఐడియాను అన్ని నగరాలకు విస్తరించాలని ఆలోచనతో దీనిపై అవగాహన పెంచుతున్నారు.
అంగ్రాజ్ న్యూస్ 18 తో మాట్లాడుతూ.. "చాలా మందికి ఇంట్లో ప్రత్యేకమైన చెత్త డబ్బాలు లేవు. అలాగే చాలా చోట్ల వేరు చేయబడిన చెత్తను సేకరించడానికి ఎవరూ లేరు. Ecowrap వారి ఇంటి వ్యర్థాలను వేరు చేయడానికి వారి వన్-స్టాప్ పరిష్కారంగా మారింది. అంతే కాకుండా వాళ్లు ఇచ్చిన చెత్తకు (Garbage) మేం కొంత డబ్బు కూడా ఇస్తాం. అయితే వారు ఇచ్చే చెత్తకు ఎంత డబ్బులు (How much money) ఇవ్వాలనేది వారి చెత్తలో వచ్చిన వ్యర్థాల తీరును బట్టి అప్పటికప్పుడు నిర్ణయిస్తాం. ప్రస్తుతం మన దేశంలో ఉన్న రీసైక్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వేరు చేయబడిన వ్యర్థాల లభ్యత లేకపోవడం. రీసైక్లర్లు సరిగ్గా వేరు చేయబడిన వ్యర్థాలను పొందడం లేదు" అని కి తెలిపారు.
స్మార్ట్ బిన్‌ల నుండి రీసైక్లర్ల వరకు..
Ecowrap సంస్థ చెత్తను నాలుగు వర్గాలుగా (Four groups) వర్గీకరిస్తారు - గాజు వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మిశ్రమ వ్యర్థాలు, అన్ని టెట్రా ప్యాక్‌లు వీటితోపాటు ఆహార వ్యర్థాలు. ఇలా విభజించిన చెత్త కోసం నాలుగు స్మార్ట్ డస్ట్‌బిన్‌లు అందించబడ్డాయి. ఇలా చెత్తను సేకరించిన తరువాత పికప్ వ్యాన్ (Pickup vans)ల ద్వారా ఆ చెత్త గోడౌన్‌కు పంపబడుతుంది, అక్కడ వేరు చేయబడిన అన్ని వ్యర్థాలను వాటి సంబంధిత కన్వేయర్ బెల్ట్‌లలో ఉంచి ఆపై రీసైక్లింగ్ (Recycling)చేస్తారు. ఇలా రిసైక్లింగ్ చేసిన చెత్త నుంచి వివిధ వస్తువులు ఉత్పత్తి చేసి వీటిని మార్కెట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం సేకరించిన వ్యర్థాలలో 1% అప్‌సైక్లింగ్ కోసం అంటే అధిక విలువ కలిగిన ఉత్పత్తిగా మార్చడం కోసం పంపబడుతుంది. దీని ద్వారా ఎకోవ్రాప్ అనేక మంది గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలకు (SHG) చెందిన మహిళలు అప్‌సైక్లింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇది ఆ మహిళలకు జీవనోపాధికి చాలా ఉపయోగపడుతుంది.
మే 2022లో హైదరాబాద్(Hyderabad)లో జరగనున్న INK@WASH 3.0 (ఇన్నోవేషన్స్ & న్యూ నాలెడ్జ్ ఇన్ వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్)లో పాల్గొనే అనేక కంపెనీలలో Ecowrap ఒకటి. త్వరలో హైదరాబాద్ లో కూడా తమ సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. జీహెచ్ఎంసీ (GHMC) భాగస్వామ్యంతో త్వరలో ఈ సంస్థ ఇక్కడ కూడా తమ సేవలను అందుబాటులో ఉంచుతుంది. INK@WASH అనేది తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ (Telangana Municipal Administration Urban Development) ద్వారా స్టార్టప్‌లు/ఆవిష్కర్తలు, మార్గదర్శకులు, విద్యాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, రాష్ట్ర ,నగర ప్రభుత్వాల మధ్య సహకారం మరియు భాగస్వామ్యాల కోసం స్థాపించబడిన ఒక ప్రత్యేకమైన వేదిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.