Fire accident : జోరువానలో కూడా కాలిన కారు.. రోడ్డుపై డ్రైవర్ పరిస్థితి విషమం

Fire accident : జోరువానలో కూడా కాలిన కారు..

Fire accident : ఓ వైపు విపరీతమైన వర్షాలు కురుస్తుంటే మరోవైపు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. రింగ్‌రోడ్డుపై వెళుతున్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.

  • Share this:
    సాధారణంగా  ఇలాంటీ సంఘటనలు ఎండాకాలంలో కామన్‌గా  జరుగుతుంటాయి..వాహనాలు కంటిన్యూగా నడపడంతోపాటు ఎండకాలంలో వేడి తట్టుకోలేని వాహానాలు మంటలకు ఆహుతి అవుతాయి.. కాని నేడు వర్షం కురుస్తున్నా..కారు హీటెక్కి మంటలు చెలరేగాయి... దీంతో  డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నాడు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్న కారులో నుండి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి..

    ఔటర్ రింగ్ రోడ్డు గుండా శంషాబాద్ వయా.. గచ్చిబౌలి లోని ఎయిర్ పోర్ట్ కాలనీ వద్ద కదులుతున్న కారు ఇంజన్ లో నుండి మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నాడు. అయితే.. అదే మార్గం నుండి వెళ్తున్నా లారీ, ఆటో డ్రైవర్‌లు గమనించి మంటల్లో చిక్కుకున్న కారు డ్రైవర్ ను బయటకు తీశారు...అనంతరం 108 వాహనికి కాల్ చేసి సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు..కాగా గాయపడ్డ డ్రైవర్ రంగారెడ్డి జిల్లా కొత్తుర్ మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు.....అయితే మంటల్లో గాయపడ్డ శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.మరోవైపు మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
    Published by:yveerash yveerash
    First published: