Car Driver: డ్రైవర్ కదా అని నమ్మాడు.. చివరకు యజమానికి టోపీ పెట్టేశాడు.. ఏమైందంటే..

కార్ డ్రైవర్ (ఫైల్)

Car Driver: ఓ కారు డ్రైవర్ రూ.55 లక్షలతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థిరాస్తి వ్యాపారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి నగదు, కారుతో పరారయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు..

 • Share this:
  హైదరాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్ భారీ చోరీ జరిగింది. స్థిరాస్తి వ్యాపారి వద్ద డ్రైవర్(Driver) గా పనిచేస్తున్న వ్యక్తి రూ.55 లక్షల నగదు, కారుతో పరారయ్యాడు. ఇటీవల జరిగిన మరో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డి వద్ద ఆరు నెలల కిందట కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. బోరబండలో ఉంటున్నాడు. కోకాపేటలో స్థలం కొన్న తాలూకు డబ్బును.. స్థలం యజమానికి డబ్బులిచ్చి రమ్మని రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కారు డ్రైవర్ శ్రీనివాస్ కు రూ.55 లక్షల నగదు ఇచ్చి పంపిస్తే.. యజమాని బెంజ్ కారు తీసుకుని బయలుదేరిన డ్రైవర్ శ్రీనివాస్.. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు వదిలేసి డబ్బులు తీసుకుని పారిపోయాడు.

  Prepaind Meters: విద్యుత్ వాడుకోవాలంటే.. ఇక నుంచి రీచార్జ్ చేసుకోవాల్సిందే..! ఆ దిశగా అడులేస్తున్న సర్కార్..


  సాయంత్రం దాటినా కోకాపేట చేరుకోలేదు. ఫోన్ స్విచాఫ్ కావడంతో అతని యజమానికి అనుమానం వచ్చింది. దీంతో సంతోష్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 10లోనే కనిపించింది. కానీ డ్రైవర్ శ్రీనివాస్.. నగదు ఏమయ్యాయో తెలియలేదు. అతడే చోరీ చేశాడా.. లేక అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్నది నిర్ధారించుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అన్ని పోలీస్‌స్టేషన్‌న్లకు సమాచారం ఇచ్చి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక బృందాలుతో డ్రైవర్ శ్రీనివాస్ కోసం గాలింపు ప్రారంభించారు.

  Sajjanar: సిర్పుర్కర్ కమిషన్​ విచారణ వేగవంతం.. ఆ రోజు విచారణకు హాజరు కానున్న సజ్జనార్..!


  మరో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
  హైదరాబాద్ గచ్చిబౌలి టెలికాం నగర్​లో ఉండే గోవిందరావు అనే వ్యక్తి ఇంట్లో కొన్ని నెలల కిందట ఓ వ్యక్తి పనిలో చేరాడు. కొంత కాలం బాగానే పనిచేశాడు. తర్వాత ఊరికి వెళ్తున్నానని చెప్పి, తాను తిరిగి వచ్చే వరకు తన బంధువులను పనిలో పెడుతున్నారని యజమానికి నమ్మబలికాడు. గోవిందరావు ఓకే చెప్పడంతో అనడంతో అతని బంధువులు లక్ష్మణ్, పవిత్ర దంపతులు నాలుగు నెలలుగా గోవిందరావు ఇంట్లో పనిచేస్తున్నారు. ఊరెళ్లిన వ్యక్తి రాకపోవడంతో వీరినే కొనసాగించారు గోవిందరావు. ఇటీవల గోవిందరావు కుటుంబ సభ్యులతో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు.

  Hyderabad : గచ్చిబౌలి దొంగలను పట్టుకున్న పోలీసులు.. 70 లక్షల సొమ్ము రికవరి..


  ఇదే అవకాశంగా భావించిన నేపాల్ దంపతులు ఇంటి కిటీకీ తొలగించి లోపలికి ప్రవేశించారు. బెడ్ రూమ్ తలుపు తొలగించి లాకర్​లో ఉన్న రూ. 10 లక్షలు సొమ్ము, 110 తులాల బంగారంతో పరారయ్యారు. ఇంటికి వచ్చిన యజమని ఇంట్లో నగదు, బంగారం లేకపోవడం, వాచ్ మెన్ కూడా కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని పోలీసులు ఫిర్యాదు చేశారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసిన వ్యక్తులు ఇలా చోరీకి పాల్పడతారని అనుకోలేదని యజమాని ఆవేదన చెందాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దొంగలను పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు.
  Published by:Veera Babu
  First published: