• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD A BOY IS BORN AT THE GOVERNMENT MATERNITY HOSPITAL IN PETLABURUJU RS 2 THOUSAND IT IS ALLEGED THAT THEY ARE CHARGING RS 15 HUNDRED A GIRL IS BORN VB

Hyderabad Hospital: ఆసుపత్రిలో ఇంత దారుణమా.. అబ్బాయికోరేటు.. అమ్మాయికోరేటు..!

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad Hospital: ఆ ఆసుపత్రిలో ప్రసవం జరిగిన తర్వాత బిడ్డను చూడాలంటే మామూలు కట్టాల్సిందే. ఆడపిల్ల పుడితే ఒకరేటు.. మగబిడ్డ పుడితే మరోరేటు. ఇలా అక్కడ డబ్బులు ఇవ్వందే ఏ పనీ కాదు. దీంతో గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడంటే..

  • Share this:
    పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నా.. వైద్య సేవలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ఈ ఆసుపత్రిలో మొదట్లో 462 పడకల ఈ ఆస్పత్రిలో మరో 172 పడకలను పెంచి..మొత్తం 634 తో రౌండ్‌ ది క్లాక్‌ వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం అవుట్‌ పేషంట్‌లకు వైద్య సేవలు కొనసాగుతాయి. అవుట్‌ పేషంట్‌ విభాగం మూసిన అనంతరం అత్యవసర కేసులను రౌండ్‌ ది క్లాక్‌ తీసుకుంటారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేస్తారు. మల, మూత్ర, రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌ రేను ఉచితంగా నిర్వహిస్తారు. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అసౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాకుండా బాత్‌రూంలతో పాటు పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉందంటున్నారు. ఇక్కడ దోమల బెడద అధికంగా ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ప్రసవం కోసం వచ్చిన గర్భినుల నుంచి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కింది స్థాయి సిబ్బంది గర్భిణుల వద్ద నుంచి ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని బోరు మంటున్నారు. మగ పిల్లవాడు పుడితే రూ. 2 వేలు, ఆడపిల్ల పుడితే రూ.15 వందలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవం జరిగిన వెంటనే పాప, బాబులను చూపించడానికి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వినిపిస్తుంటాయి.

    అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని రోగులు కోరుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వైద్యాధికారులతో పాటు సిబ్బంది ఖండించారు. వారి సంతోషం కోసం చాయ్‌ తాగమని ఎవరైనా డబ్బులిస్తే ఇచ్చి ఉండవచ్చుగానీ.. సిబ్బంది డిమాండ్‌ చేయడం లేదన్నారు.
    Published by:Veera Babu
    First published: