అక్రమ సంబంధాలు ఒక మనిషి జీవితాన్నే కాదు కుటుంబాలనే రోడ్డున పడేస్తాయి. పరువు బజారున పడుతుంది. సంసార సుఖంలో ఇబ్బందులు, పాత ప్రేమికులు, కామ వాంఛ ఏదో ఒక కారణంతో వివాహేతర, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇవి ఎన్నో రోజులు సాగవు. చిన్నచిన్న గొడవలు ఏకంగా చంపేసుకోవడం దాకా దారి తీస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ (Hyderabad)లోని జవహర్ నగర్లో జరిగిన హత్య కేసులో అక్రమ సంబంధం ఉందనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన యువకుడి (Younger)తో వివాహేతర సంబంధం (Extramarital Affairs) పెట్టుకుని ఆ తర్వాత దూరం పెట్టడంతో తన ప్రాణాలే పోయేలా చేసింది. ఏకంగా ఆ యువకుడి మహిళను చంపేశాడు. ఈ కేసు వివరాలు ఒకసారి తెలుసుకుందాం..
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పరిధిలో మహిళ మిస్సింగ్ మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జవహర్‌నగర్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. 48 ఏళ్ల మహిళ (Women) , భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి కాప్రా వంపూగూడలో నివాసం ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం నుంచి సికింద్రాబాద్ (Secunderabad)లో ఓ హోటల్‌లో పని చేసింది. అక్కడే వర్క్ చేస్తోన్న మారేడుపల్లికి చెందిన అశోక్(36)తో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి (Extramarital Affairs) దారితీసింది.
అశోక్ (Ashok) కాప్రా సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. అయితే ప్రియురాలితో గడిపేందుకు సమీపంలోనే మరో సెపరేట్ రూమ్ (Separate Room) రెంట్‌కు తీసుకున్నాడు. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైనప్పటికీ ఆ మహిళ అశోక్‌తో లైంగిక సంబంధం (Sexual Affair) కొనసాగిస్తోంది. ఈ విషయం ఇటీవల అశోక్ భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో అశోక్ ప్రియురాలిని రెగ్యులర్‌గా కలవలేకపోతున్నాడు. అయితే ఇదే క్రమంలో ప్రియురాలు ఇటీవల మరికొందరితోనూ సన్నిహితంగా ఉంటున్నట్లు అశోక్‌కు తెలిసింది. దీంతో అశోక్ కోపం కట్టలు తెంచుకుంది. తనను మోసం చేసిన ఆమెను అంతమొందించాలని పథకం వేశారు.
ఈ నెల 5 తేదీన ఆమెను తన రూమ్‌కి రమ్మని చెప్పాడు అశోక్. ఇంట్లో చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్తున్నానని మనవరాలికి చెప్పి ఆమె బయటికొచ్చింది. వెళ్లిన మనిషి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. రాత్రయినా ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్‌పై అనుమానం (Doubt) ఉందని వారు ఫిర్యాదు (Complaint)లో పేర్కొనడంతో పోలీసులు (Police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా హత్య (Murder) చేసినట్లు అంగీకరించాడు. మరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతోనే ప్రియురాలిని గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకొన్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు డెడ్‌బాడీని శామీర్‌పేట (Shameerpet) మండలం లాల్‌గడి మలక్‌పేట్ అటవీ ప్రాంతంలో వెలికితీసి ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అశోక్‌పై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Extra marital affair, Hyderabad, Murder, Women