హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: క్లైయిమ్ చేయని వాహనాలను వేలం వేసిన పోలీసులు..!

Hyderabad: క్లైయిమ్ చేయని వాహనాలను వేలం వేసిన పోలీసులు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ వాహనాలు పోలీస్ స్టేషన్లలలోనే పలు కారణాలతో క్లెయిమ్ చేయకుండా వదిలేశారు. అలాంటి స్క్రాప్ వాహనాలు రూ.56,07,000లకు వేలం వేయబడ్డాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనేక కేసుల్లో బుక్కై.. క్లెయిమ్ చేయని వాహనాల్ని పోలీసులు వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో 16వ సారి క్లైయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం వేశారు. ఈ వేలం పాటలో 962 స్వాధీనం చేసుకున్న ... వదిలివేసిన వాహనాలను నగర పోలీసులు సోమవారం వేలం వేశారు. వేలం సందర్భంగా, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (CAR) హెడ్‌క్వార్టర్స్ M శ్రీనివాస్ ఎక్కువగా ఆటోమొబైల్ రంగానికి చెందిన బిడ్డర్లను ఉద్దేశించి, న్యాయమైన బిడ్‌ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 550 మంది బిడ్డర్లు హాజరుకాగా మొత్తం 959 వాహనాలను వేలం వేశారు.

వీటిలో 893 ద్విచక్ర వాహనాలు, 8 త్రిటైర్ వాహనాలు, 15 ఫోర్ వీలర్ వెహికల్స్ఉన్నాయి. ఈ వాహనాలు పోలీస్ స్టేషన్లలలోనే పలు కారణాలతో క్లెయిమ్ చేయకుండా వదిలేశారు. అలాంటి స్క్రాప్ వాహనాలు రూ.56,07,000లకు వేలం వేయబడ్డాయి. పత్రికా ప్రకటనల ద్వారా వాహనాల యజమానులకు పోలీసులు విషయం తెలియజేసినప్పటికీ, చాలా మంది తమ వాహనాలను వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో క్లెయిమ్ చేయని కొన్ని వాహనాల పరిస్థితి మరింత దిగజారింది, వాటిని స్క్రాప్ డీలర్లకు మాత్రమే అమ్మడానికి పనికి వస్తాయి.

మిగిలిన 43 వాహనాలు, 42 ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాన్ని రూ.10,12,000లకు వేలం వేశారు. వేలంలో వచ్చిన మొత్తం రూ.66,19,000 , అయితే మూడు టూవీలర్ వాహనాల్ని ... రోడ్డు రవాణా అధికారులు నిర్ణయించిన ధర రాకపోవడంతో వాటిని రిజక్ట్ చేశారు. ఈ వేలం పాట ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు.

First published:

Tags: Hyderabad, Hyderabad police, Local News

ఉత్తమ కథలు