హోమ్ /వార్తలు /తెలంగాణ /

So Sad: పెళ్లైన 14 ఏళ్లకు జన్మించిన చిన్నారి.. అయ్యో పాపం ఏడాది కూడా గడవకుండానే..

So Sad: పెళ్లైన 14 ఏళ్లకు జన్మించిన చిన్నారి.. అయ్యో పాపం ఏడాది కూడా గడవకుండానే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆ దంపతులకు చాలా ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కానీ సంతానం కలగలేదు. పిల్లల కోసం వారు చేయని ప్రయత్నం లేదు. అయితే పెళ్లి జరిగిన 14 ఏళ్లకు వారి జీవితంలో వెలుగులు నిండాయి.

  ఆ దంపతులకు చాలా ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కానీ సంతానం కలగలేదు. పిల్లల కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఎన్నో మొక్కులు మొక్కారు, ఎంతో మంది వైద్యులను కూడా సంప్రదించారు. అయితే పెళ్లి జరిగిన 14 ఏళ్లకు వారి జీవితంలో వెలుగులు నిండాయి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వారి ఇళ్లు చిన్నారి నవ్వులతో నిండిపోయింది. కానీ అంతలోనే ఊహించని విధంగా ఆ నవ్వులు వారికి దూరమయ్యాయి. డెంగీతో (Dengue) చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. పెళ్లి జరిగిన 14 ఏళ్లకు పుట్టిన పాప.. ఇప్పుడు 8 నెలలకు మృతిచెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌ (Hyderabad) నగరంలో చోటుచేసుకుంది.

  వివరాలు.. చేవెళ్ల (Chevella) రజకనగర్‌కు చెందిన శ్రీనివాస్‌, మంజుల దంపతులకు చాలా ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. శ్రీనివాస్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లి జరిగి 14 ఏళ్లు అయిన వారికి పిల్లలు లేరు. అయితే గతేడాది మంజుల గర్భం దాల్చడంతో ఆ కుటుంబ ఎంతో సంబరపడిపోయింది. 8 నెలల క్రితం మంజుల పాపకు జన్మనిచ్చింది. ఆ పాప సహస్ర అని పేరు పెట్టారు. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత జన్మించిన పాల కావడంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

  Married Woman: పెళ్లి జరిగిన 10 రోజులకు యువతికి ఊహించని షాక్.. అత్తకు ఆ విషయం చెబితే..


  అయితే ఇంతలోనే ఊహించని విధంగా ప్రమాదం చుట్టుముట్టింది. సెప్టెంబర్ 26న పాప అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అ తర్వాత మెరుగైన వైద్యం కోసం మియాపూర్ పరిధి మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి (Private Hospital) తరలించారు. అయితే అక్కడ పాపకు నిర్వహించిన పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ ఆస్పత్రిలో ఐసీయూ లేకపోవడంతో.. పాపను అదే ఆస్పత్రికి చెందిన కూకట్‌పల్లిలోని బ్రాంచ్‌కు తరలించారు. సెప్టెంబర్ 28 నుంచి కూకట్‌పల్లికి పాపకు చికిత్స సాగుతుంది.

  Shocking: అతనికి భార్య, ఇద్దరు కొడుకులు.. పక్క ఊరి మహిళతో ఎఫైర్.. ఆమె కోసం అన్ని చేస్తుంటే..

  అయితే పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి పాప మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళ చేపట్టారు. ఈ విషయం తెలుసకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పాప బంధువులకు నచ్చజెప్పి పంపించారు. లేకలేక పుట్టిన బిడ్డ ఇలా ఏడాది తిరగముందే మృతి చెందడతో శ్రీనివాస్, మంజుల దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు చూస్తున్నవారు చలించిపోయారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Dengue fever, Hyderabad

  ఉత్తమ కథలు