Home /News /telangana /

HYDERABAD 8 LAKHS STOLEN BY CYBER FRAUDSTERS IN HYDERABAD IN THE NAME OF CURRENT BILL SNR BK

Hyderabad : 2వేల రూపాయిల కరెంట్ బిల్లు కోసం 8ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు .. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు

(మహానగరంలో మాయగాళ్లు)

(మహానగరంలో మాయగాళ్లు)

Cyber ​​fraudsters:హైదరాబాద్‌లో దేశముదుర్లు పెరిగిపోయారు. ఆన్‌లైన్‌ మోసాల్లో అప్‌డేట్‌ అవుతున్నారు. నిన్నటి వరకు బ్యాంక్‌ ఖాతాల పేరుతో చీటింగ్ చేసిన సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కరెంట్ బిల్లుల పేరుతో ఓ వ్యక్తికి మస్కా కొట్టారు. రెండు వేల బిల్లు కోసం 8లక్షలు కాజేశారు.

ఇంకా చదవండి ...
  (M.Balakrishna,News18,Hyderabad)
  రోజురోజుకి పెరుగుతున్న సైబ‌ర్ నేరాళ్ల‌(Cyber ​​fraudsters)పై ప్ర‌జ‌ల్లో కూడా కొంచెం అవ‌గాహాన పెరుగుతుంది. సైబ‌ర్ పోలీసులు(Police) నిత్యం మోసాలు ఎలా జ‌రుగుతాయో ప్ర‌త్యేక‌మైన అవ‌గాహాన కార్య‌క్ర‌మాల‌తో సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాల‌కు కాస్త చెక్ పెడుతున్నారు. అయితే ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు కూడా త‌మ రూట్ మార్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు మోసాలు చేసిన దారిలో కాకుండా కొత్త దార్లో వెతుకుతున్నారు. ఇప్ప‌టికే బ్యాంకు ఖాతా(Bank Account) వివరాల నుంచి క్యూఆర్‌ కోడ్‌(QR code)ల వరకు అన్ని ప‌ద్ద‌తుల్లో మోసాలు చేసిన ఈ కేటుగాళ్లు వాటి గురించి అంద‌రిలో అవ‌గాహాన రావ‌డంతో ఇప్పుడు మ‌రో రూట్ లో మోసాలు చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

  మహానగరంలో మాయగాళ్లు..
  కొత్తగా సైబర్‌ నేరగాళ్లు ఎంతుకున్న మార్గం కరెంటు బిల్లులు. ఏంటీ క‌రెంట్ బిల్లుల‌తో మోసాలు ఎలా చేస్తారని ఆశ్చ‌ర్య‌పోతున్నారా పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌ పేరుతో ఓ సైబర్‌ మోసగాడు చేసిన ఘనకార్యం తెలుసుకోవాల్సిందే. మీకు మీ పెండింగ్ క‌రెంట్ బిల్లులు క్లియర్‌ చేస్తామని చెప్పి ఈ కేటుగాళ్లు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ ఉద్యోగిగా నటిస్తూ మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తారు. అలా సంప్ర‌దించి మీ క‌రెంట్ బిల్లు మేమే క‌డ‌తాం మీరు కేవ‌లం మేము చెప్ప‌ని యాప్ మీ ఫోన్‌లో అప్‌లోడ్ చేసుకుంటే చాలని నమ్మబలుకుతారు. వాళ్ల‌ని న‌మ్మి మీరు ఈ యాప్ మీ ఫోన్ లో వేసుకున్నారో ఇక అంతే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అవ‌డం ఖాయం.  సైబర్‌ నేరగాళ్ల న్యూ టెక్నిక్..
  ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడే హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి కేవలం రెండు వేల రూపాయిల కరెంట్ బిల్లు కోసం సుమారు  8 ల‌క్ష‌ల రూపాయిలు పోగొట్టుకున్నాడు. అసలు ఈ తరహా మోసం ఎలా జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. సైబ‌ర్ నేరాగాళ్లు మ‌న  మొబైల్ ఫోన్‌కు SMS లేదా వాట్సాప్ ద్వారా మెసెజ్ పంపింస్తాడు. ఆ మెసేజ్‌లకు స్పందించిన బాధితుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని  తమను తాము ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని మీరు కరెంటు బిల్లులు చెల్లించలేదు అందుకే మీకు కరెంట్ సప్లై నిలిపివేస్తోన్నామని పోన్ కట్ చేస్తారు.

  Telangana Exams Postponed: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ 4 యూనివర్సిటీల పరీక్షలన్నీ వాయిదా.. పూర్తి వివరాలివే


  రెండు వేల పేరుతో లక్షలు మాయం..
  ఇది జరిగిన కొన్ని నిమిషాలకే మ‌ళ్లీ అదే వ్య‌క్తి మీకు ఫోన్ చేసి ఇప్పుడే చెక్ చేశాం క్రింద‌టి నెల యూనిట్ అడ్జెస్ట్‌మెంట్ ఉంది. మీరు మేము చెప్పిన యాప్‌ని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఒక 30 రూపాయిలు చెల్లిస్తే చాలు మీరు ఈ నెల ప‌వ‌న్ బిల్ క‌ట్టావ‌స‌రం లేద‌ని చెబుతారు. దీంతో సాదార‌ణంలో ప‌వ‌న్ కట్ అవుతుంద‌నే ఆందోళ‌న‌లో మ‌నం క‌నీసం చెక్ చేసుకోం వాళ్లు పంపించిన లింక్‌లోని యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్లు చెప్పినట్లుగా హైదరాబాద్‌కి చెందిన బాధితుడు డబ్బులు చెల్లించాడు. అంతే అక్కడి నుంచి ఎవరైతే 30రూపాయలు కట్టాడో అతని బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బులు పోవడం మొదలైంది. అయితే అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఒకే ట్రాన్సక్షన్‌లో డబ్బులు లాగేస్తారు. తక్కువగా ఉంటే కొద్ది కొద్దిగా డబ్బును కాళీ చేస్తున్నాట్లుగా తేల్చారు పోలీసులు.

  నయా సైబర్ మోసం..
  ఈ తరహా నేరాలపై అప్ర‌మత్త‌మైన అధికారులు పవ‌ర్ బిల్లులు చెల్లించిన వారి డేటా వీళ్ల‌కు ఎలా వెళ్లుతుంద‌నే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు సైబ‌ర్ సెల్ అధికారులు. ఇప్పటి వ‌ర‌కు న‌గ‌రంలో జ‌రిగిన మోసాలుకు కాస్త భిన్నంగా ఉండ‌డంతో ఇప్పుడు సైబ‌ర్ సెల్ అధికారులు కూడా ఇదో కొత్త త‌ర‌హా మోస‌మ‌ని ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేయ‌డానికి స‌న్న‌హాలు చేస్తోన్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: CYBER FRAUD, Greater hyderabad, Telangana crime news

  తదుపరి వార్తలు