Home /News /telangana /

HYDERABAD 7500 APPLICATIONS IN FIVE DAYS FOR AUCTION OF RAJIV SWAGRHA FLATS IN HYDERABAD SNR

Telangana:రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలానికి భారీ పోటీ..5రోజుల్లో ఎన్ని దరఖాస్తులో తెలుసా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Telangana:ప్రభుత్వం వేలానికి వేసిన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల వేలంపై విశేష స్పందన వస్తోంది. నోటిఫికేషన్ వేసిన ఐదు రోజుల్లో 7500అప్లికేషన్స్‌ వచ్చాయి. మొత్తం 2900ఫ్లాట్ల అమ్మకం కోసం గడువులోగా కనీసం లక్ష అప్లికేషన్స్‌ వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంకా చదవండి ...
సొంతింటి కల. అతి తక్కువ ధరకే కట్టించిన ఇళ్లు. హైదరాబాద్‌(Hyderabad)సిటీకి మధ్యలో ఉన్న అపార్ట్‌మెంట్లు(Apartments). ఇంతకంటే ఏం కావాలి నగరంలో నివసించే వాళ్లకు. అందుకే ప్రభుత్వం ఆల్రెడీ కట్టించిన ఇళ్లు అమ్ముతున్నామని నోటిఫికేషన్ విడుదల చేసిందో లేదో ..కుప్పలు, తెప్పలుగా అప్లికేషన్లు వచ్చిపడుతున్నాయి. నిజంగా ఇంత డిమాండ్ వేటికి ఉందో తెలుసా. ప్రభుత్వం కట్టించిన రాజీవ్ స్వగృహ(Rajiv Swagrha)ఇళ్లకు ప్రభుత్వం ఓ ఫిక్స్‌డ్ ధరFixed price నిర్ణయించి ఫ్లాట్ల బుకింగ్‌ ఆఫర్‌(Flats booking)ని ప్రకటించింది. ఈనెల 12వ తేదిన నోటిఫికేషన్(Notifications) విడుదల చేస్తే కేవలం 5రోజుల్లో 7,500అప్లికేషన్‌(Application‌s)లు వచ్చాయి. ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉంది.

విశేష స్పందన..
కేవలం ఐదు రోజుల్లో 7500 అప్లికేషన్స్ వస్తే జూన్‌ 14వతేది చివరి గడువులోగా లక్ష అప్లికేషన్స్‌ వచ్చే అవకాశముందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అంతే కాదు లాటరీ సిస్టమ్‌ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని ప్రకటించడంతో ..ఒక్క అప్లికేషన్‌కి ఇల్లు వస్తుందో లేదో అనే సందేహంతో ఒక్కొక్కరు 5నుంచి 10 అప్లికేషన్స్‌ పెట్టుకున్నారు. బండ్లగూడ, పోచారంలోని 2971 సింగిల్, డబుల్‌, ట్రిపుల్‌, ట్రిపుల్ డిలక్స్ ఫ్లాట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకున్న జాబితాలోని పేర్లను కంప్యూటర్ లాటరీ ద్వారా జూన్‌ 22వ తేదిన ఫ్లాట్లను కేటాయించడం జరుగుతుంది.

ఇంతకంటే చౌకగా దొరకవు..
ముఖ్యంగా ట్రిపుల్ బెడ్రూం డిలక్స్ ఫ్లాట్ కేవలం 50లక్షలలోపే వస్తుండటంతో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్లలో 1,501, ప్లాట్లు, పోచారంలో 1,470 ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం. బండ్లగూడలో ఒక్క స్క్వేర్ ఫీట్‌కి (పూర్తిగా రెడీ అయిన) రూ.3 వేలు, సెమిఫినిష్డ్ రూ.2,750గా ఖరారు చేశారు. ట్రిపుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్‌ 48 లక్షల15వేలకు అందుబాటులో ఉంది. ఇదే ప్రాంతంలో వేరే ఫ్లాట్ కొనాలంటే సుమారు 75లక్షలు ధర ఉన్నట్లుగా తెలుస్తోంది. పోచారంలో కంప్లీట్ అయిన ఫ్లాట్‌ స్వేర్‌ ఫీట్‌కి రూ.2,500, సెమిఫినిష్డ్ కు రూ.2,250 ధరను ఖరారు చేసింది ప్రభుత్వం.

800కోట్ల రూపాయల ఆదాయం..
ఒక్కో అప్లికేషన్‌కి వెయ్యి రూపాయల ఫీజును నాన్‌ రిఫండబుల్‌గా వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు దరఖాస్తుల ద్వారానే సర్కారుకి 75 లక్షల ఆదాయం వచ్చింది. ఒక్కో వ్యక్తికి ఆధార్‌ కార్డ్‌ పేరుతో ఒకే అప్లికేషన్ ఇస్తుండటంతో కొందరు కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటున్నారు. మొత్తం ఈ రెండు ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలం ద్వారా సర్కారుకు 800కోట్ల ఆదాయం రానుంది. అయితే ప్రభుత్వం వేలానికి పెట్టింది 2900ఫ్లాట్లు మాత్రమే. ఈ కొద్ది ప్లాట్లకే ఇంత డిమాండ్ ఉందంటే ..గడువు ముసిగే సమయానికి లక్ష అప్లికేషన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెబుతున్నారు.

హోమ్ లోన్‌ సదుపాయం..
దరఖాస్తులు చేసుకునే వారి కోసం బండ్లగూడలో హౌసింగ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉదయం 10గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అప్లికేషన్స్‌ తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం, ప్రైవేట్, ఉద్యోగులకు శాలరీ, ఆదాయం ప్రకారం లోన్‌ ఫెసిలిటీ డిటెయిల్స్ చెబుతున్నారు. అర్హతలు ఉంటే ఫ్లాట్ ఖరీదులో 90శాతం లోన్ ఇప్పించేందుకు కూడా రెడీగా ఉన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Double bedroom houses, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు