Home /News /telangana /

HYDERABAD 70 KILOGRAMS OF GANJA SEIZED AND TWO WERE ARRESTED IN HYDERABAD VRY

Ganjai Special Drive : నగరంలో 70 కిలోల గంజాయి పట్టివేత.. పలువురు అరెస్ట్.. !

గంజాయి స్వాధీనం

గంజాయి స్వాధీనం

Ganjai Special Drive : గంజాయి స్మగ్లింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు హైదరాబాద్‌లో ఆటోలో తరలిస్తున్న 70 కిలోల గంజాయిని పట్టుకుని పలువురిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

    రాష్ట్ర వ్యాప్తంగా గంజాయితో పాటు డ్రగ్స్ ( Drugs ) అమ్మకాలపై రాష్ట్ర పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. దీంతో రాష్ట్ర నలుమూలలతోపాటు నగరాల్లో సైతం గంజాయి ( Ganjai ) స్మగ్లింగ్ చేస్తున్న వారితో పాటు వినియోగదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. ఇలా ఇప్పటికే కోట్ల రూపాయల గంజాయిని రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సప్లై చేస్తున్న వారిపై కూడా పీడీ యాక్టులు సైతం నమోదు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే గ్రేటర్ పోలీసులు ( Hyderabad police ) మూడు కమీషనరేట్‌ల పరిధిలో స్పెషల్ డ్రైవ్‌లు ( Special drive ) నిర్వహిస్తున్నారు. సీపీలు అంజన్ కుమార్, స్టిఫేన్ రవీంద్రతోపాటు మహెశ్ భగవత్‌లు నేరుగా గంజాయి స్మగ్లింగ్ పై మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఓఆర్ఆర్, తోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

     ఇది చదవండి : బెంగళూరులో దారుణ ఘటన.. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్న యువతిని..


    దీంతో గత రెండు రోజుల్లోనే 20 మందికి వరకు అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నేడు ఓ ఆటోలో తీసుకువెళ్తున్న 70 కిలోల గంజాయిని పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు సీపి అంజన్ కుమార్ మీడియాకు తెలిపారు.

    ఇది చదవండి : మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యయత్నం.. లైవ్ వీడియో పోస్ట్..


    గంజాయి సప్లై మీడియాతో పాటు స్థానిక యువకులు సమాచారం ( Information ) తెలిసిన వారు పోలీసులకు చెప్పాలని ఆయన కోరారు. ఇందుకోసం వాట్సప్ నెంబర్లకు చేయడం లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గంజాయిని అరికట్టడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

    ముఖ్యంగా వాట్సప్‌ల ద్వారా గంజాయి డీలింగ్ జరుగుతుందని సమాచారం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో తనిఖీల్లో వాహనాలతో పాటు ప్రత్యేకంగా యువకుల వాట్సప్‌లు ( Watsapp ) కూడా చెక్ చేయడం గమనార్హం. తనిఖీల్లో అనుమానస్పదంగా కనిపించిన యువకుల వాట్సప్‌లో వారినే గంజాయి అని టైప్ చేయించి ఎక్కడైనా అలాంటీ సమాచారం ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. లేదంటే పోలీసులే ఫోన్లను తీసుకుని చెక్ చేస్తున్నారు. అయితే ఇలా వ్యక్తిగతంగా ఫోన్లు చెక్ చేయడం పై పలువురు యువకులు సోషల్ మీడియా ద్వారా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Hyderabad crime

    తదుపరి వార్తలు