corona : జీహెచ్‌ఎంసీలో 63 మినీ కంటైన్‌మెంట్ ప్రాంతాలు

corona : జీహెచ్‌ఎంసీలో 63 మినీ కంటైన్‌మెంట్ ప్రాంతాలు

జీహెచ్‌ఎంసీలో 63 మినీ కంటైన్‌మెంట్ ప్రాంతాలు

జీహెచ్‌ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఐదు కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఒకే అపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసులు వస్తే హౌజ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తారు.

  • Share this:
తెలంగాణలో కరోనా రెండవ దశ విసృతంగా విజృంభిస్తుంది. రాష్ట్ర దీంతో ప్రభుత్వం పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కరోనా పాజిటీవ్ కేసులు అంతకు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లోను పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి..ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన కరోనా కట్టడి,మరియు నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది.

ఈ కంటైన్‌మెంట్‌ జోన్లలో ఐదు కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ఒకే అపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసులు వస్తే హౌజ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తారు. ఆయా పరిధిలో వైద్యారోగ్య, మున్సిపల్‌ సిబ్బందిని మాత్రమే అనుతించి నివారణ చర్యలు చేపట్టనున్నారు.
అంతేకాదు, కరోనా కట్టడి కోసం జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు, శానిటైజేషన్‌పై దృష్టి సారించాయి. ఎక్కువగా కోవిడ్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో రసాయనాలను స్పే చేస్తున్నారు. ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ కూడ చేసినట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు నగరవ్యాప్తంగా ప్రత్యేకంగా శానిటైషన్ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. నగరంలో పేరుకుపోయిన చెత్తతో పాటు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరంలో ఆకస్మిక తనిఖీలు కూడ చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: