హోమ్ /వార్తలు /తెలంగాణ /

Liquor Sale: మద్యం సేల్స్‌తో సర్కారు ఖజానా కళకళ ..రెండ్రోజుల్లో ఎన్ని వందల కోట్ల రూపాయల మందు తాగారంటే

Liquor Sale: మద్యం సేల్స్‌తో సర్కారు ఖజానా కళకళ ..రెండ్రోజుల్లో ఎన్ని వందల కోట్ల రూపాయల మందు తాగారంటే

LIQUOR SALES(FILE)

LIQUOR SALES(FILE)

Hyderabad Police: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డిసెంబర్‌ 30,31తేదీల్లో జనం పీకల దాకా తాగడంతో రాష్ట్ర ఖజానాకు ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(M.Balakrishna,News18,Hyderabad)

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. 2022 డిసెంబరు(December)30, 31న తెలంగాణ వ్యాప్తంగా రూ.410 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు(Liquor sale)చేశారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 5819 మంది  లైసెన్సులు రద్దు చేసినట్టు హైదరాబాద్ (Hyderabad)జాయింట్ రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ వెల్లడించారు. 2021 సంవత్సరానికంటే 3220 కేసులు అధికమని నాయక్ తెలిపారు.

Hyderabad: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారి డ్రైవింగ్ లైసెన్సుల రద్దు ..ఒక్క రోజులో ఎంత మంది అంటే..?

పీకల దాకా తాగారు..

రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలుతెలంగాణలో మద్యం అమ్మకాలు దుమ్మురేపాయి. న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు తమ సత్తా చాటారు. తెలంగాణలో డిసెంబరు 30, 31న అంటే రెండు రోజుల్లోనే రూ.410 కోట్ల విలువైన మద్యం సేవించి రికార్డులు బద్దలు కొట్టారు. డిసెంబరు 30న ఒక్కరోజే తెలంగాణలో రూ.250  కోట్లు, 31న రూ.160 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది కేవలం హోల్ సేల్ మార్కెట్లకు సంబంధించిన సమాచారం మాత్రమే. ఇక రిటైల్ సమాచారం అందుబాటులోకి వస్తే ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి 1 ఆదివారం నాడు మద్యం హోల్ సేల్ మార్కెట్లు మూసివేశారు.

410కోట్ల లిక్కర్ సేల్స్ ..

మందుతాగి నడిపితే లైసెన్స్ రద్దుమందుతాగి వాహనాలు నడిపే వారిపై రవాణా, ట్రాఫిక్ పోలీసులు కొరడా  ఝుళింపించారు. డిసెంబరు 31 రాత్రి మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారికి చెందిన 5819 డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడినందుకు లైసెన్స్‌లను రద్దు చేసినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. ఇది 2021 కంటే 3,220 ఎక్కువ అని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

రికార్డ్‌ స్థాయిలో సేల్స్ ..

ఒక్కో జోన్లో ఒక్కో రకంగాహైదరాబాద్ నగరంలో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయి. అందులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్‌లు పనిచేస్తున్నాయి.  ఈస్ట్ జోన్ మినహా అన్ని జోన్‌లలో లైసెన్సులు భారీగా రద్దు చేసినట్లు నాయక్ తెలిపారు. నార్త్ జోన్‌లో 1103, సౌత్ జోన్‌లో 1151, ఈస్ట్ జోన్‌లో 510, వెస్ట్ జోన్‌లో 1345 లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఒక్క ఈస్ట్ జోన్ మినహా అన్ని జోన్లలో 2021 కన్నా రెట్టింపు స్థాయిలో డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేశారు.

ఓ వైపు తుమ్మల మరోవైపు పొంగులేటి..ఖమ్మంలో రాజకీయ కాక..వారి అడుగులు ఎటు?

కేసుల్లోనూ రికార్డులే ..

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకేదేశ వ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల భారినపడి లక్షా 40 వేల మంది చనిపోతున్నారు. గత ఏడాది అంటే 2022లో తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో 6వేల మందికిపైగా చనిపోయారు. ఇందులో ఎక్కువగా తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే తాగి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా కూడా వేస్తున్నారు.

First published:

Tags: Liquor sales, Telangana News

ఉత్తమ కథలు