తెలంగాణ (Telangana)ట్రాఫిక్ పోలీసులు రికార్డ్ సృష్టించారు. పెండింగ్ చలాన్ల (Challans)క్లియరెన్స్‌లో భాగంగా వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇస్తూనే సర్కారు ఖజానా నింపేందుకు మ్యాగ్జిమమ్ ట్రై చేశారు. మొదట ఇచ్చిన నెల రోజుల కంటే చివర్లో పొడిగించిన 15రోజుల వ్యవధిలో భారీ కలెక్షన్లు రాబట్టారు. కేవలం 15రోజులకు 303కోట్ల(303Crore) రూపాయలు పెండింగ్ చలాన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police). ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాళ్లకు ట్రాఫిక్ పోలీసులు వన్ టైమ్ డిస్కౌంట్ (One Time Discount)పేరుతో పెండింగ్ చలాన్లపై రాయితీ ఇచ్చి భారీ వసూళ్లు రాబట్టారు. కరోనాకు ముందు నుంచి ట్రాఫిక్ చలాన్ల రూపంలో రాష్ట్రంలోని వాహనదారులు ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్లపైగా బాకీ ఉన్నారు. అంత మొత్తంలో వసూలు చేయడం ఎలా అనే ఐడియాలో భాగంగానే చలాన్లలో రాయితీ ఇస్తున్నామనే ప్రకటనతో వాహనదారుల దగ్గర నుంచి 30శాతం చలాన్ల డబ్బులు వసూలు చేశారు. మొత్తం 1004కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉండగా..ఏప్రిల్ ఫస్ట్ నుంచి 15వ తేది వరకు 303 కోట్లు వసూలు అయ్యాయి.
15రోజుల్లో 300కోట్లు..
ట్రాఫిక్ చలాన్ల వసూళ్లు, ట్రాఫిక్ నిబంధనలు అమలు విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈసారి కొత్త పంథాను అవలంభించారు. వీఐపీలు, సెలబ్రిటీలు అందరి దగ్గర చలాన్లు వసూలు చేశారు. ఇక స్టిక్కర్స్, బ్లాక్ ఫిల్మ్ తొలగింపు వంటి వాటిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా 303 కోట్ల రూపాయలను గడిచిన పదిహేను రోజుల్లో వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్‌లో పరిధిలోని 65శాతం మంది వాహన యజమానులు తమ చలాన్‌లను క్లియర్ చేశారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
చలాన్ల క్లియరెన్స్‌లో రికార్డ్..
అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే చలాన్లు క్లియర్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సదావకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకున్నారని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కేవలం కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ వెసులుబాటు కల్పించినట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు ఆ ఉద్దేశంతోనే వదిలేశామని..ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని పెండింగ్ చలాన్లు క్లియర్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఆఫర్ వర్కవుట్ అయింది..
వన్ టైమ్' డిస్కౌంట్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం 15రోజుల్లో 5.5 కోట్లు వసూలు అయ్యాయి. తొలిరోజు చివరి నిమిషానికి సుమారు 1,000 చలాన్లు క్లియర్ అయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరెట్ పరిధిలోనే రూ. 600 కోట్ల పెండింగ్ చలాన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కల్పించిన డిస్కెంట్‌ని ఉపయోగించుకొని టూ వీలర్లు, ఆటోలు 25శాతం చలాన్లు చెల్లిస్తే మిగిలిన 75శాతం చలాన్ల డబ్బును మాఫీ చేశారు. మిగిలిన వాహనాలకు వారికి కేటాయించిన రాయితీని యధాతధంగా అమలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.