HYDERABAD 30 IPS TRANSFERS IN TELANGANA CV ANAND NEW CP OF HYDERABADA ANJANI KUMAR TO HEAD ACB THESE IS THE MAIN REASON NGS
IPS Transfers: హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. కారణం ఇదే..?
హైదరాబాద్ సీపీగా సీవి ఆనంద్
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 30 మందిని బదిలీ చేయడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ ను రప్పించడం.. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్ ను బదిలీ చేయడానికి కారణం ఇదే అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
IPS Transfers: తెలంగాణ (Telangana)లో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఒకేసారి 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లను ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)సీపీగా సీవీ ఆనంద్ (C V Anand), ప్రస్తుతం కమిషనర్ గా కొనసాగుతున్న అంజనీ కుమార్ (Anjani Kumar) ఏసీబీ డీజీగా, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్ (AV Ranganath) , ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్ (Shikha Goel), హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్ (AR Srinivas), నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి (Rama Rajeshwari), సిద్దిపేట్ సీపీగా ఎన్ శ్వేత ( N Swetha), హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్ (Joel Davis), మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని (Rohini Priyadarshini), సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్ సింగేశ్వర్ (Kalmeshwar Shingewar), సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి (avinash mohanty), హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి (chandana deepti), హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్ (Gaja Rao Bhupal), హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా పి విశ్వప్రసాద్( P Vishwa Prasad) ను నియమించింది.
ఇక మిగిలినవారిలో వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సుదీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీగా కార్తికేయ, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 1గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, నారాయణ్‌పేట్ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. transfers-signed copy (2)
అయితే ఈ బదిలీల పై నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకుంది కాదని.. సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా ఈ పేర్లను మదించిన తరువాతే బదిలీలు జరిగాయని ప్రచారం ఉంది. ముఖ్యంగా వివిధ ఎన్నికలు, ఇతర కారణాలతో ఈ బదీలల పర్వం వాయిదా పడుతూ వచ్చినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఈ బదీలల వెనుకు బలమైన కారణమే ఉన్నట్టు పొలిటికల్ వర్గాల టాక్.. శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. అయితే సీఎం కేసీర్ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లే.. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు.. అయితే ముందస్తు ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి.. అధికారులతో మంచి టీం తయారు చేసుకోవాలని సీఎం కేసీఆర్ భావించారని.. ఇందులో భాగంగానే వారి పని తీరు.. ఇతర అంశాల ఆధారంగా ఈ బదిలీల చేశారని రాజకీయ విశ్లేషకుల మాట.
మరోవైపు పోలీసు శాఖలోనూ సీనియర్ అధికారులు, కమిషనర్లు, ఎస్పీల బదిలీలు చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతోంది కాబట్టి ఇంకా ఈ బదిలీలు ఆలస్యం చేయడం మంచిది కాదని సీఎం కేసీఆర్ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. పలు శాఖల్లోని గ్రూప్-1 స్థాయి అధికారులు అధిపతుల హోదాలో కొనసాగడం.. పనితీరు సరిగా లేని కొంత మంది ఉన్నత పదవుల్లో ఉండడం.. ఇలా వారి పనితీరును పరిశీలించి.. ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కడ ఉంటే అన్ని విధాలా ఉపయోగం ఉంటుంది అన్ని లెక్కలు వేసుకున్న తరువాత ఈ స్థాయి బదిలీలు జరిగాయని రాజకీయ విశ్లేషకులు మాట.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.