Hyderabad: బస్సుల్లో కిటికీ పక్కన కూర్చుని జర్నీ చేస్తున్నారా..? హైదరాబాద్ లో సిటీ బస్సులో కూర్చున్న ఈ కుర్రాడి ప్రాణం ఎలా పోయిందో తెలిస్తే..!

ప్రమాదంలో మరణించిన చైతన్య (ఫైల్ ఫొటో)

23 ఏళ్ల కుర్రాడు. బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగాల వేటలో హైదరాబాద్ కు వచ్చాడు. హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ ఊహించని రీతిలో సిటీ బస్సులో సీట్లో కూర్చుండగానే మరణించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

 • Share this:
  మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి దాకా నవ్వుతూ తుళ్లుతూ మాట్లాడిన వ్యక్తే సడన్ గా శవమై కనిపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. రాత్రి వరకు బాగానే మాట్లాడి నిద్రపోయిన వ్యక్తి తెల్లారేసరికి మరణించాడన్న వార్తలను మీరు ఎన్నో విని ఉంటారు. రోడ్డు పక్కన తన మానాన తాను నడుస్తూ వెళ్తున్నా యాక్సిడెంట్ బారిన పడి శవాలైన వారు ఎందరో ఉన్నారు. ఫ్లై ఓవర్ పై వెళ్తున్న కారు ప్రమాదానికి గురయి దూసుకొచ్చి ఎక్కడో చెట్టు కింద నిలుచున్న వ్యక్తిపై పడిన ఘటనల గురించి చూసే ఉంటారు. తాజాగా తన మానాన తాను బస్సులో కూర్చున్న ఓ యువకుడు మృత్యువు బారిన పడ్డాడు. బీటెక్ పూర్తి చేసి ఉన్నతోద్యోగాల వేట కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆ కుర్రాడు, బస్సులో ప్రయాణిస్తూ తన సీటులో కూర్చుండగానే ప్రమాదానికి గురయ్యాడు. చివరకు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  పెద్దపల్లికి చెందిన కుమ్మరి కనకరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 23 ఏళ్ల పవన్ చైతన్య బీటెక్ పూర్తి చేశాడు. జాబ్స్ కు ప్రిపేర్ అయేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. ఎస్ ఆర్ నగర్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం హాస్టల్ నుంచి ఫ్రెండ్స్ రూమ్ కు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేందుకు పటాన్ చెరు నుంచి దిల్ సుఖ్ నగర్ వస్తున్న సిటీ బస్సును ఎక్కాడు. కిటికీ పక్కనే కూర్చున్నాడు. కోఠిలోని గోకుల్ ఛాట్ వద్దకు చేరుకున్న సమయంలో తోటి ప్రయాణికులు చైతన్య తలకు గాయాలయ్యాయనీ, తీవ్రంగా రక్తస్రావం అవుతోందని గుర్తించారు. వెంటనే బస్సును పక్కన ఆపించి 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ లో అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చైతన్య మరణించాడని వైద్యులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  బస్సులో కూర్చున్న వ్యక్తికి అసలు గాయాలు ఎలా అయ్యాయా? అని ఆరా తీస్తే పోలీసులకు ఓ షాకింగ్ నిజం తెలిసింది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యపూరిత డ్రైవింగే ఆ కుర్రాడి ప్రాణం తీసిందని బయటపడింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసేందుకు చైతన్య ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలోనే చైతన్య ఉన్న బస్సు టైరు గుంతలో పడింది. దాంతో చైతన్య తల కిటికీ అద్దానికి బలంగా తగిలింది. తీవ్ర రక్తస్రావం అయింది. బస్సు కుడివైపున చైతన్య కూర్చున్నాడు. అదే కుడివైపున బస్సు స్వల్పంగా దెబ్బతిన్న ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు గ్రహించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆ కుర్రాడు మరణించాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చైతన్య ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..
  Published by:Hasaan Kandula
  First published: