HYDERABAD 17 LAKHS LOST BY CYBER CRIMINALS AT GOLKONDA IN HYDERBAD VRY
cyber crime : లేని కారు కోసం 17 లక్షలు...సైబర్ వలలో భాదితుడు..!
నగరంలో సైబర్ నేరాలను అదుపులో పెట్టేందుకు రాష్ట్ర పోలీసులు రోజు అలర్ట్ చేస్తున్నారు. ఇందుకు కోసం
అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా..తాజాగా నగరానికి చెందిన ఓవ్యక్తికి కారు బహుమతిగా వచ్చిందంటూ
టోకరా వేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
cyber crime : హైదరాబాద్ పోలీసులు ఎంత అలర్ట్ చేస్తున్నా డబ్బు అత్యాశ ఉన్నవారు సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు..రోజు ఏదో రూపంలో మాయ చేస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మీరు ఓ కారు గెలిచారంటు బురిడి కొట్టించి అక్షరాల 17 లక్షల రూపాయలు కొట్టెశారు..
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కొండకు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్‌కు ఫోన్ చేసి మీరు చాలా విలువైన కారు గెలిచారంటూ సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేశారు.
అయితే కారు కావాలా..డబ్బులు కావాలా అంటూ ప్రశ్నించారు. అయితే తనకు కారు అవసరం లేదని ,డబ్బులే కావాలని చెప్పాడు.
ఇంకేముంది సైబర్ నేరాగాళ్ల వలలో ఓ చేప చిక్కినట్టు చిక్కిన బాధితుడు ఫ్రీ మని కోసం వారు చెప్పినట్టు చేశాడు. అధిక డబ్బుల కోసం ఉన్న డబ్బును పోగొట్టుకున్నాడు.
డబ్బులు కావాలంటే చార్జీలు, టాక్స్‌ల పేరుమీద మొత్తం 17 లక్షల 35వేల రూపాయలను కాజేశారు. అయితే చివరకు వారు కాంటాక్ట్ క్లోజ్ కావడంతోపాటు ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో బాధితుడికి మోసపోయానని తెలిసింది. దీంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.