హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్ దందా..వారం రోజుల్లో 160కోట్ల రూపాయల సరుకు సీజ్

Telangana: హైదరాబాద్‌ అడ్డాగా డ్రగ్స్ దందా..వారం రోజుల్లో 160కోట్ల రూపాయల సరుకు సీజ్

(వందల కోట్ల డ్రగ్స్ సీజ్ )

(వందల కోట్ల డ్రగ్స్ సీజ్ )

Drugs Mafia:హైద‌రాబాద్ డ్ర‌గ్స్‌కి అడ్డాగా మారుతోందా..?  వారం రోజుల్లో కోట్లాది రూపాయల మాదకద్రవ్యాలు పట్టుబడటం చూస్తుంటే ఈ నగరానికి ఏమైందనే డౌట్స్ కలుగుతున్నాయి. కరోనా నిబంధనలు తొలగించిన తర్వాత నుంచే డ్రగ్స్‌ మాఫియా పెట్రోగిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...

(M.Balakrishna,News18,Hyderabad)

హైద‌రాబాద్‌(Hyderabad)లో అస‌లేం జ‌రుగుతుంది..?  డ్ర‌గ్స్ అడ్డాగా మారుతోందా ..?  వారం రోజుల్లోనే 160 కోట్ల విలువైన డ్ర‌గ్స్ పట్టుబడింది.డ్ర‌గ్స్ కు హైద‌రాబాద్ అడ్డ‌గా మారుతుంది. గత రెండు వారాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం దాదాపు రూ.160 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి.   మే 4న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హైదరాబాద్‌లోని దోమలగూడ(Domalaguda)లో ఉన్న జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్(JR Infinity Pvt)అనే ఇంటర్నెట్ ఫార్మసీ కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి రూ. 3.71 కోట్ల నగదు మాదక ద్రవ్యాల స్వాధీనం చేసుకున్నారు.  అక్రమ ఇంటర్నెట్ ఫార్మసీని నిర్వహించడానికి ఉపయోగించిన అనేక ల్యాప్‌టాప్‌లు(Laptops), మొబైల్ ఫోన్‌(Mobile phones), లు మ‌రియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌(Electronic gadget)లను కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గత రెండు వారాల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(Directorate of Revenue Intelligence),ఎన్‌సిబి(NCB) మరికొన్ని నిఘా ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని పట్టుకున్నాయి.

హైదరాబాద్ అడ్డాగా దందా..

మే 4న హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 1,157 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది దాని విలువ దాదాపు 11.57 కోట్లు. DRI, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 44 ఎళ్ల వ‌య‌సున్న అతను ఏప్రిల్ 21న ఎమిరేట్స్‌లో జోహన్నెస్‌బర్గ్ నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. విచారణలో అతను కొకైన్‌తో కూడిన క్యాప్సూల్స్‌ను తీసుకున్నట్లు విచార‌ణ‌లో వెల్లడించాడు.

వారంలో 160 కోట్ల రూపాయల సరుకు..

మే 6న హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సౌతాఫ్రికాకు చెందిన మహిళ నుంచి రూ.54 కోట్ల విలువైన 6.75 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈమె జోహన్నెస్‌బర్గ్ నుండి దోహా మీదుగా ఖతార్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ నంబర్ QR-500 ద్వారా వచ్చింది. ఇలా రెండు వారాల వ్యవధిలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో హెరాయిన్‌ పట్టుబడడం ఇది ఐదోసారి. ఐదు కేసుల్లో రూ.150 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మే 1న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.80 కోట్ల విలువైన ఎనిమిది కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. గతంలో టాంజానియాకు చెందిన వ్యక్తి నుంచి రూ.11.57 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్‌ఐతో పాటు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇత‌ను ఏప్రిల్ 21న జోహన్నెస్‌బర్గ్ నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

ఎక్కడెక్కడి నుంచో సప్లై..

కొకైన్, హెరాయిన్‌లను వంటి మత్తు ప‌దార్ధాల‌ను దేశంలోకి అక్ర‌మ రావాణా చేయ‌డానికి అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే కాకుండా ప్ర‌పంచంలో ఇత‌ర దేశాలైన‌ ఆస్ట్రేలియా, ఫార్ ఈస్ట్ వంటి ప్రాంతాల‌కు డ్రగ్స్‌ను తరలించడానికి హైదరాబాద్ మొయిన్ పాటింట్ గా మారింది. ఇక్క‌డ‌కి స‌రుకు చేర‌వేసి ఇక్క‌డ నుంచి ఆ ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం ఈజీ అని భావిస్తోన్నారు స్మ‌గ్ల‌ర్స్. గోవా, ముంబై హైదరాబాద్‌లు డ్రగ్స్ పంపిణీకి కేంద్రంగా మారుతున్నాయా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తోన్నాము. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెడ్లర్ల నెట్‌వర్క్‌పైన కూడా ఒక క‌న్నేసి ఉంచినట్లుగా సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఒక అధికారిని తెలిపారు. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు పెరుగుతున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గత 16 నెలల్లో దాదాపు 350 కిలోల కొకైన్ దాని విలువ బ‌హిరంగా మార్కెట్ లో దాదాపు రూ. 3500. కోట్లు. ప్ర‌స్తుతం నాణ్యమైన కొకైన్ ధర దేశంలో అక్రమ మార్కెట్‌లో కిలో రూ.10 కోట్లు గా ఉంది. COVID-19 తర్వాత, కొకైన్ ధర 1.5 కోట్ల నుంచి 2 కోట్లు కి పెరిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు

First published:

Tags: Drugs racket, Telangana

ఉత్తమ కథలు