హైదరాబాద్ (Hyderabad)లో ట్రాఫిక్ ఉల్లంఘనలు సర్వ సాధారణం. అయితే నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ నింబంధనలు పాటించే వారి సంఖ్య కంటే ఉల్లంఘించే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం హైదారాబద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) నిత్యం ఒక కన్నేసి ఉంచుతారు. ప్రత్యేకమైన సీసీటీవీ కెమెరా (CCTV Camera) ద్వారా నిఘాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్స్ తో కూడా ఇలా ట్రాఫిక్ నింబంధనలు (Traffic rules) ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
జనవరి 1 నుంచి జూలై 7 వరకు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా హెల్మెట్ ధరించనందుకు నమోదైన కేసులే ఉండటం విశేషం. ఇలా హెల్మెట్ ధరించకపోవడం అత్యంత సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన అని ఈ సర్వేలో తెలింది.. 2022 జనవరి 1 నుంచి జూలై 7 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని వాహనదారులపై 15,46,245 కేసులు నమోదు చేశారు. సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది మొత్తం 21,76,326 కేసులు బుక్ చేశారు. వీటిలో 8,87,883 చలాన్లు క్లియర్ కాగా 12,88,443 చలాన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.
53 లక్షల కేసులు..
2022లో హైదరాబాద్ పోలీసులు ఓవర్ స్పీడ్ పై 61,398 కేసులు నమోదు చేశారు. 2021లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ఉల్లంఘనలపై 53 లక్షల కేసులు నమోదు చేశారు. జూలై 2న పలువురు టీఆర్‌ఎస్ నాయకులు (TRS) హెల్మెట్ ధరించకుండా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే డి.నాగేందర్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ సభ్యులు హెల్మెట్ లేకుండానే ర్యాలీలో హెల్మెట్ ధరించకుండా బైక్ ర్యాలీలో పాల్గోన్నారు. అయితే వీరిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంప పై పలు విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు 68 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా వీరిలో 47 మంది హెల్మెట్ ధరించకపోవడం వలనే మరణించారని చెబుతున్నారు అధికారులు, సైబరాబాద్‌లో గత ఆరు నెలల్లో మొత్తం 211 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. జనవరి నుండి నమోదైన మరణాలలో ద్విచక్ర వాహన ప్రమాదాలు 58% ఉన్నాయి. ఈ 211 మందిలో 172 మంది హెల్మెట్ ధరించని వాహనదారులు కాగా, మిగిలిన వారు పిలియన్ రైడర్లు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గతేడాది నిర్వహించిన సర్వేలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణించిన వారిలో 82% మంది హెల్మెట్ ధరించకపోవడం వలనే మరణిస్తున్నట్లు తెలింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.