HYDERABAD 139 TRAFFIC PENDING CHALLANS ON A BIKE AND SEAGED BIKE VRY
Traffic challans : వామ్మో ఒక్క బైక్‌పై ఇన్ని చలానాలా..?... అవాక్కయిన పోలీసులు.
traffic challans
Traffic challans : కెమెరా పోలీసింగ్ వచ్చిన తర్వాత వాహానదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి...పోలీసులు లేరు కాదా అని నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి ఎప్పుడో ఓ రోజు టూ వీలర్
స్వాధీనం అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది..దీంతో వాహానాదారులు లబోదిబోమని మొత్తుకునే పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపథ్యంలోనే ఓక్కొ బైకర్‌కు లేకా వెహికిల్స్‌కి పది కాదు, ఇరవై కాదు ఏకంగా వందల కొద్ద చాలనాలు పెండింగ్ ఉంటున్నాయి..... అయితే పోలీసులకు పట్టుబడే వరకు అలా తిరుగుతున్న వారికి పోలీసుల తనిఖీల్లో ఎప్పుడో ఓ రోజు చిక్కుకుంటున్నారు. అయితే ఇలా కావాలనే తిరురుగుతున్నారా లేక తప్పించుకు తిరుగుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి.
వివరాల్లోకి వెళితే..నేడు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు సబితా నగర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను టెస్ట్‌ను పోలీసులు నిర్వహించారు.దీంతో సమీర్ అనే వ్యక్తి బైకు ఆపి చెక్ చేశారు.. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. సమీర్ బైక్‌పై ఏకంగా 139 చలాన్లు, ఉండగా మొత్తం 54 వేల రూపాయల జరిమానాలు ఉన్నాయి. దీంతో వాటిని చెల్లించి బైకును తీసుకువెళ్లాలని పోలీసులు చెప్పారు. అయితే అంతపెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో సమీర్ కాళ్ల బేరానికి వచ్చిన పరిస్థితి.. అందులో ఉన్న తక్కువ మొత్తంలో ఉన్న 25 చలాన్ల డబ్బులను కట్టేందుకు అంగీకరించాడు. దీంతో బైకును తీసుకువెళ్లేందుకు పోలీసులు అంగీకరించారు.
మొత్తం మీద పోలీసులు లేరనే నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తున్న వారికి చలాన్లు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పుడైనా పోలీసులకు బైక్ దొరకడం ఎక్కువ చలాన్ల ఉన్న బైక్‌లను స్పెషల్ డ్రైవ్ ద్వార పోలీసులు పట్టుకుని బైక్‌ను తీసుకుని వెళుతున్నారు.
ఒకవేళ బైక్‌ను అమ్మాలని నిర్ణయించినా...పూర్తి పెండింగ్ బకాయిలు చెల్లించనిదే ఆ బైక్ ఇతరుల పేరుమీద ట్రాన్స్ఫర్ అయ్యో అవకాశాలు ఉండవు..దీంతో పూర్తిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే తప్ప పోలీసులు చలాన్ల నుండి తప్పించుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
ఇవన్ని భరించలేని కొంతమంది యువకులు నడిరోడ్డుపై తమ వాహానాలను తగులబెట్టిన సంఘటనలు చూశాము.. దీంతో పాటు టూ వీలర్స్‌ను సైతం రోడ్డుపై వదిలి వేసి వెళ్లడంతో పాటు సీజ్ చేసిన చాలా వాహానాలను చలానా డబ్బులు చెల్లించలేక ఎంతోమంది వాటిని అక్కడే వదిలి వేసి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.