Home /News /telangana /

Election Results : హుజూర్‌నగర్‌లో గెలిచేదెవరు... ఫలితం తేలేది నేడే...

Election Results : హుజూర్‌నగర్‌లో గెలిచేదెవరు... ఫలితం తేలేది నేడే...

హుజూర్‌నగర్‌లో గెలిచేదెవరు... ఫలితం తేలేది నేడే...

హుజూర్‌నగర్‌లో గెలిచేదెవరు... ఫలితం తేలేది నేడే...

Huzurnagar Election Result 2019 : మరికొన్ని గంటల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితాలు రాబోతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలవుతుంది.

    Huzurnagar Election Result 2019 : దేశమంతా... మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదని ఎదురుచూస్తుంటే... తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం వాటికంటే ఎక్కువ ఆసక్తిగా హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదన్న దానిపై ఎక్కువ ఆసక్తిగా చూస్తున్నారు. ఇవాళ జరిగే కౌంటింగ్ కోసం... సూర్యాపేట జిల్లాలోని మార్కెట్ గోడౌన్లలో పూర్తి ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాల పహారాలో, ఫుల్లుగా సీసీ కెమెరాలు పెట్టి... ఓట్ల లెక్కించబోతున్నారు. మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 22 రౌండ్‌లు లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలు ముగుస్తుంది. ఉదయం 10 కల్లా గెలుపు ఎవరిదో అంచనాకు వచ్చేయొచ్చు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లున్నారు. 2,00,754 ఓట్లు పోలయ్యాయి. వాటిని లెక్కించడతోపాటూ... ప్రతి మండలానికీ 5 వీవీప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కిస్తారు.

    ఈ ఎన్నికలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. TRS నుంచీ శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచీ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచీ చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా పోటీ సైదిరెడ్డి, పద్మావతిరెడ్డి మధ్యే ఉన్నా.... విజయం టీఆర్ఎస్‌దేనని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఐతే... ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఈ ఎన్నికపై పడుతుందనే అంచనా ఉంది. అదీకాక... హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ కంచుకోట కావడం, అక్కడ ఎప్పుడూ టీఆర్ఎస్ గెలవకపోవడం వల్ల విజేత ఎవరన్నది ఆసక్తిగా ఉంది.

    సైదిరెడ్డి గెలిస్తే హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ గెలిచినట్లవుతుంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం ఎన్నికపై పడలేదని అనుకోవచ్చు. పద్మావతి గెలిస్తే కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నట్లవుతుంది. అలాగే సమ్మె ప్రభావం కొంతైనా ఈ ఎన్నికపై పడిందని అనుకోవచ్చు.

     

    Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు



    ఇవి కూడా చదవండి :

    Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

    Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

    Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి


    Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు

    ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Huzurnagar bypoll 2019, Telangana News, Telangana updates, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు