Home /News /telangana /

హుజూర్‌నగర్ ఎన్నికలు... నేటితో ప్రచారానికి తెర... ఎల్లుండి పోలింగ్

హుజూర్‌నగర్ ఎన్నికలు... నేటితో ప్రచారానికి తెర... ఎల్లుండి పోలింగ్

హుజూర్‌నగర్ ఎన్నికలు... నేటితో ప్రచారానికి తెర... ఎల్లుండి పోలింగ్

హుజూర్‌నగర్ ఎన్నికలు... నేటితో ప్రచారానికి తెర... ఎల్లుండి పోలింగ్

Huzurnagar Election : ఓవైపు తెలంగాణ బంద్ జరుగుతున్న వేళ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియబోతోంది. గెలుపుపై అన్ని పార్టీలూ ధీమాతో ఉండటం విశేషం.

    Huzurnagar Election : సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ బైపోల్... తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి నెల రోజులుగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం సాగించాయి. తమ కంచుకోటను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే... ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి... 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని... 4 ఏళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్నప్పటికీ.... పోటీ ప్రధానంగా ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి గెలుపు కోసం... కాంగ్రెస్ ఉద్ధండులంతా ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తిరిగి గెలుస్తుందనేందుకు హుజూర్‌నగర్‌లో జరిగిన అభివృద్ధే నిదర్శనం అని వారంతా గొప్పగా చెబుతున్నారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టే... ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్‌లో చేరుతున్నారనీ, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే... నియోజకవర్గ అభివృద్ధికి అది మేలు చేస్తుందని అంటున్నారు.

    అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్... మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ ప్రచారం... సాయంత్రం 5 గంటలకు ముగియనుండగా... సోమవారం ఉదయం ఎన్నికలు మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఫలితాలు ఈ నెల 24న రానున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె జురుగుతున్న వేళ... దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. ఒకవేళ బైపోల్‌లో కాంగ్రెస్ గెలిస్తే... తెలంగాణలో ఆ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశాలుంటాయని భావిస్తున్న గులాబీ బాస్... అదే జరిగితే ఏం చెయ్యాలనేదానిపైనా ఇప్పటి నుంచీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

    అటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ఇవాళే ముగియనుంది. అక్కడ కూడా సోమవారం ఎన్నికలు జరగనుండగా... అక్టోబర్ 24న ఫలితాలు రానున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో తిరిగి గెలిచేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా... లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్... ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం అనుకున్న స్థాయిలో పోరాడలేదనే చెప్పాలి. అనారోగ్యం వల్ల అధినేత్రి సోనియాగాంధీ ప్రచారం సాగించలేకపోగా... పార్టీ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీయే అన్నీ తానై చూసుకోవాల్సి వచ్చింది. ఐతే... జమ్మూకాశ్మీర్ విభజన అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచుకున్న బీజేపీ... కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉంది.

     

    Pics : అందం, అభినయంతో కట్టిపడేస్తున్న రీమ్ సమీర్ షేక్


    ఇవి కూడా చదవండి :

    IND vs SA : నేడు భారత్, సౌతాఫ్రికా మూడో టెస్టు... వైట్‌వాషే టార్గెట్

    నేడు తెలంగాణ బంద్... క్యాబ్ సర్వీసులూ బంద్... చర్చలు లేవ్...

    Health Tips : శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

    Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
    First published:

    Tags: Huzur nagar by election 2019, Huzurnagar bypoll 2019, Telangana News, Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు