Huzurnagar Results | సైదిరెడ్డికి హుజూర్.. మెజారిటీలో రికార్డు బ్రేక్

సైదిరెడ్డికి 112796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69,563 ఓట్లు వచ్చాయి. దీంతో సైదిరెడ్డి 43,233 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

news18-telugu
Updated: October 24, 2019, 3:45 PM IST
Huzurnagar Results | సైదిరెడ్డికి హుజూర్.. మెజారిటీలో రికార్డు బ్రేక్
శానంపూడి సైదిరెడ్డి
  • Share this:
హుజూర్ నగర్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి జీ హుజూర్ అన్నారు. సైదిరెడ్డికే సై కొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసినా.. తాము అధికార పార్టీ వైపే ఉన్నామని స్పష్టం చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఫలితాలను వెలువడ్డాయి. మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి కనీసం ఒక్క రౌండ్‌లో కూడా ఆధిక్యం రాలేదంటే.. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి, సైదిరెడ్డికి ఎంతలా సలాం కొట్టారో అర్థం చేసుకోవచ్చు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 2,00,239 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో సైదిరెడ్డికి 112796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69563ఓట్లు వచ్చాయి. దీంతో సైదిరెడ్డి 43,233 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈస్థాయిలో మెజారిటీ రావడం ఇదే తొలిసారి. గతంలో ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు ఇంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు.

ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూడండి


హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, బీజేపీ నుంచి కోటా రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీ చేశారు. అయితే, సైదిరెడ్డి, పద్మావతి రెడ్డి తర్వాత ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి మూడో స్థానంలో ఉండడం విశేషం. బీజేపీ, టీడీపీ అభ్యర్థుల కంటే కూడా స్వతంత్ర అభ్యర్థి సపావత్ సుమన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

First published: October 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>