హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala Rajender : హుజురాబాద్ నుండే మలి ఉద్యమం... సీఎం కేసిఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు..!

Eetala Rajender : హుజురాబాద్ నుండే మలి ఉద్యమం... సీఎం కేసిఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు..!

కాగా ఈటల రాజేందర్ 2014 నుండి సోసైటి చైర్మన్ గా కొనసాగారు. కాగా పదిహను రోజుల క్రితమే ఆ పదవికి 

రాజీనామా కూడా చేశారు.

కాగా ఈటల రాజేందర్ 2014 నుండి సోసైటి చైర్మన్ గా కొనసాగారు. కాగా పదిహను రోజుల క్రితమే ఆ పదవికి రాజీనామా కూడా చేశారు.

Eetala Rajender : హుజురాబాద్‌లో రానున్న ఉప ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరగనున్న ఎన్నికలంటూ మాజి మంత్రి ఈటల జేందర్ అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా కేంద్రబిందువని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో మొదటి సారి పర్యటించిన ఆయన ర్యాలీ నిర్వహించారు.

ఇంకా చదవండి ...

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన నియోజవర్గం హుజురాబాద్‌లో పర్యటించారు. తన 19 సంవత్సరాల రాజకీయా ప్రస్థానం తర్వాత టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు బైక్ ర్యాలీ చేపట్టారు. ముఖ్యంగా కమాలాపూర్ మండలంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనంతరం మండలంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు...

బైక్ ర్యాలీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..దీంతో ఆయన రాజీనామాపై వచ్చిన వార్తలకు సమాధానం చెప్పినట్టయింది. ముఖ్యంగా ఈటల రాజీనామా చేసేందుకు వెనకడుగు వేస్తున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. దీంతో ఈటల రాజీనామా చేయడం ఖాయమని స్పష్టం చేశారు.


ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా కేంద్ర బిందువని ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు సీఎం కేసిఆర్‌కు బుద్ది చెప్పెందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ సంధర్భంగా ప్రజలు తనకు భరోసా ఇచ్చారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ధర్మానికి ,అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందని ఘాటుగా విమర్శించారు. ఇక హుజురాబాద్‌ నుండే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగరవేస్తామని అన్నారు.. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసేందుకు టీఆర్ఎస్ చూస్తుందని ఆరోపించారు.

బీజేపీలో చేరేందుకు సిద్దం అయినా ఈటల రాజెందర్ తన మంత్రి పదవి నుండి బర్తరఫ్ అయిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణను ఇటివలే ప్రకటించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా త్వరలోనే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాగా అంతకుముందే ఢిల్లి వెళ్లి బిజెపి అగ్ర నాయకత్వంతో సమావేశం అయిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈటల రాజీనామా చేస్తారనే ప్రకటన తర్వాత హుజురాబాద్‌లో ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ అధినేత పావులు కదుపుతున్నారు..వరంగల్ పర్యటనలో ఇందు కోసం సమాలోచనలు జరిపారు. కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంట్లో పార్టీ నేతలతో సమావేశం పెట్టడంతో పాటు కరీంనగర్‌కు చెందిన ఇతర నాయకులను సైతం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణకు సైతం ఆహ్వానం పంపారు. ఓవైపు పార్టీ బలోపేతానికి అన్ని ఏర్పాట్లను చేస్తునే మరోవైపు ఆయనపై కేసుల విచారణ వేగవంతం చేశారు..దీంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల ..రెండు సార్లు సీఎంగా అయిన కేసిఆర్ మధ్య రానున్న ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

First published:

Tags: CM KCR, Eetala rajender, Huzurabad By-election 2021, Karimnagar

ఉత్తమ కథలు