Home /News /telangana /

HUZURABAD BYPOLL 2021 BJP WORKERS PROTEST AGAINST KAUSHIK REDDY IN VEENAVONKA SK

Huzurabad Bypoll: హుజురాబాద్‌లో ఉద్రిక్తత.. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు

ఐడీ కార్డు చూపిస్తున్న కౌశిక్ రెడ్డి

ఐడీ కార్డు చూపిస్తున్న కౌశిక్ రెడ్డి

Huzurabad Bypoll: తాను చీఫ్ ఎలక్షన్ ఏంజెంట్‌ని ఏ పోలింగ్ కేంద్రంలోకైనా వెళ్లే అధికారం ఉందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నిసార్లైనా వెళ్తానని తెగేసి చెప్పారు. మరోవైపు గ్రామస్తులు మాత్రం ఆయన్ను అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...
  హుజురాబాద్‌ నియోజకవర్గంలో పోలింగ్ (Huzurabad Bypoll)కొనసాగుతోంది. పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. వీణవంక మండలంలో రెండు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఘన్ముక్లలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నారు. ఆయన పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లవచ్చు. కానీ క్యూలైన్‌లో ఉన్న ఓటర్లను ఆయన ప్రభావితం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు కలగజేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి పంపించివేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఓటువేసిన వారు ఎవరూ బయట ఉండకూదదని.. ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  తాను చీఫ్ ఎలక్షన్ ఏంజెంట్‌ని ఏ పోలింగ్ కేంద్రంలోకైనా వెళ్లే అధికారం ఉందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నిసార్లైనా వెళ్తానని తెగేసి చెప్పారు. మరోవైపు గ్రామస్తులు మాత్రం ఆయన్ను అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  ఓటు హక్కు వినియోగించుకున్న ఈటెల దంపతులు.. ఆ ఒక్కమాట చెప్పిన ఈటల..

  కాగా, ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eetala Rajender), ఆయన భార్య జమున (Jamuna) కమలాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ మండలం కందుగుల ZP హైస్కూల్ లో ఓటింగ్ సరళిని పరిశీలించారు ఈటల. ఉప్పలపల్లిలోని పోలింగ్ బూత్ ను కూడా పరిశీలించారు. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. “ అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది . మాకు డబ్బులు అందలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చారు . పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు . ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది . మంచి చెడులను ఆలోచించే సత్తా ప్రజలకు ఉంది " అని పేర్కొన్నారు.

  Huzurabad By Elections: మొరాయించిన ఈవీఎంలు.. మొదలైన గొడవ.. తొలి గంటలో ఎంత పోలింగ్ అంటే..

  మొత్తం దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 3 లోక్ సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హుజురాబద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక హుజురాబాద్ లో పోలింగు ప్రశాంతంగా .. పకడ్బందీగా నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మొత్తం 2,37,022 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు . సంబంధించి 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లేం దుకు వీల్ చైర్లను , కోవిడ్ రోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  Palamuru project : సీఎం కేసీఆర్ వైఫల్యమే పాలమూరు- రంగారెడ్డి పై ఎన్జీటి  స్టే

  పోలింగ్ జరిగే హుజూరాబాద్ నియోజకవర్గంలో నేడు 144 సెక్షన్ అమలులో ఉంటుంది . ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలను ఉప యోగిస్తున్నారు . మొత్తం బందోబస్తు సిబ్బంది 3,865 మంది కాగా , ఎన్నికల సిబ్బంది 1715 విధుల్లో పాల్గొననున్నా రు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పోటీ తాజా మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావుల మధ్య కొనసాగనుంది. నవంబరు 2న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు