Huzurabad Bypoll: ఈటల రాజేందర్‌కు పోటీగా మరో ముగ్గురు రాజేందర్‌లు.. అందరి ఇంటి పేరు 'ఈ' తోనే స్టార్ట్..

ఈటల రాజేందర్

Huzurabad Bypoll: హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో అధికార పార్టీ కుట్రలు చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈటల రాజేందర్‌కు పడే ఓట్లకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే.. అదే పేరుతో ఉన్న అభ్యర్థులను వెతికి, వారితో నామినేషన్ వేయించారని ఆరోపిస్తున్నారు.

  • Share this:
    హుజురాబాద్‌ (Huzurabad)లో ఎన్నికల ప్రచార పర్వం మరింత వేడేక్కింది. నామినేషన్లు ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఐతే నామినేషన్లలో ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో రాజేందర్‌ పేరుతో మొత్తం నలుగురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (Eetala Rajender) పోటీ చేస్తున్నారు. ఆఖరి రోజున రాజేందర్‌ పేరుతో ఉన్న మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వారి ఇంటిపేర్లు కూడా అచ్చం ఈటల మాదిరిగానే ఉన్నాయి. 'ఈ' అనే అక్షరంతో ఇంటి పేర్లు ప్రారంభమవుతాయి. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఇమ్మడి రాజేందర్‌, న్యూ ఇండియా పార్టీ తరపున ఈసంపల్లి రాజేందర్, ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్‌ శుక్రవారం నామినేషన్లు సమర్పించారు.

    ఐతే ఇది టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో అధికార పార్టీ కుట్రలు చేస్తోందని మండిపడుతున్నారు. ఈటల రాజేందర్‌కు పడే ఓట్లకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే.. అదే పేరుతో ఉన్న అభ్యర్థులను వెతికి, వారితో నామినేషన్ వేయించారని ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేేసినా.. ఎన్ని కోట్ల డబ్బులు వెదజల్లినా.. ఈటెల గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు.

    Bathukamma: బతుకమ్మల మీదుగా దూసుకెళ్లిన కారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర దుమారం


    హుజురాబాద్ ఉపఎన్నికల్లో మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు ఎన్నికల అధికారులు ఉన్నారు. వీరిలో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులు ఉన్నారు. మొత్తంగా 61 మంది 92 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు ఫైల్ అవుతాయని భావించినా ఉహించినంతగా అభ్యర్థులు రాలేదు. అయితే ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్స్ నామినేషన్స్ వేసేందుకు ముందుకు వచ్చినా కోవిడ్ నిబంధనలతో వారిని తిరిగి వెనక్కి పంపారంటూ ఆందోళన సైతం చేశారు. దీంతో నిరుద్యోగ యువత కాని, ఇతరులు కాని వెనుదిరిగిన పరిస్థితి కినిపించింది. ఇక మొత్తం నామినేషన్‌లలో స్క్రూటిని తోపాటు.. ఉప సంహరణ తేదీ ముగిసిన నాటికి ప్రధాన పార్టీల మధ్యే పోటి ఉండనుంది.

    హుజురాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీస్ అధికారులు నిఘా, తనిఖీలను ముమ్మరం చేశారు. హుజురాబాద్‌కు వెళ్లే అన్ని రోడ్లపై పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్న ఆర్డీవో కార్యాలయంతో పాటు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్లతో నిఘాపెట్టారు.

    Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు ఛాలెంజ్ ఇదే

    కాగా, హుజురాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలయింది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో నామినేషన్ల దాఖలు ముగుస్తుంది. అక్టోబరు 11న నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 13కు గడువు ఉంది. అక్టోబరు 30న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2న ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: