Huzurabad By-election 2021 : గ‌ల్లీల్లో గస్తీ తిరగండి.. తెచ్చిన సొమ్ము గుంజుకోండి : రేవంత్‌రెడ్డి

ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న రేవంత్ రెడ్డి

Huzurabad By-election 2021 : హుజూరాబాద్‌లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ బల్మూర్ గారికి మద్దతుగా హుజురాబాద్‌లో రేవంత్‌రెడ్డి ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ భారీగా డ‌బ్బులు ఖ‌ర్చుపెడుతుంద‌న్నారు. ప్ర‌జ‌లు పోలింగ్​ తేదీ వరకు గల్లీ గల్లీ తిరిగి గస్తీ కాయాలని.. ఎవరు డబ్బు పంచినా గుంజుకోవాలని సూచించారు.

 • Share this:
  హుజూరాబాద్‌ (Huzurabad) లో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ బల్మూర్ గారికి మద్దతుగా హుజురాబాద్ పట్టణంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  హాజరై జోరుగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుజూరాబాద్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ (Congress) అభ్యర్థిగా బల్మూరి వెంకట్​ బరిలో నిలవడం వల్ల ఇరు పార్టీల అభ్యర్థులు చెరో 120 కోట్లు రూపాయలు పంచారని.. అంటే మొత్తం రూ.240 కోట్ల సొమ్ము హుజూరాబాద్​ ప్రజలకు చేరిందని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇవాళ సాయంత్రం నుంచి పోలింగ్​ తేదీ వరకు గల్లీ గల్లీ తిరిగి గస్తీ కాయాలని.. ఎవరు డబ్బు పంచినా గుంజుకోవాలని సూచించారు.

  కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​ను గెలిపిస్తే.. రాబోయే 30 ఏళ్లు ప్రజల పక్షాన పోరాటం చేస్తారని రేవంత్​ రెడ్డి గారు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా.. పక్కటెముకలు విరిగిపోయేలా కొట్టినా.. ప్రజల పక్షాన పోరాడుతున్నందునే బల్మూరి వెంకట్​కు కాంగ్రెస్​ పార్టీ టికెట్​ ఇచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి గారు చెప్పారు. ప్రజల కోసం యుద్ధం చేసినోళ్లు కావాలా.. ఓట్ల కోసం డబ్బులు పంచినోళ్లు కావాలా హుజూరాబాద్​ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.

  Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?


  ఈట‌ల ఎప్పుడైనా ప్ర‌శ్నించారా..?
  ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం ఈటల ఎప్పుడైనా పోరాడారా?.. దళితులకు మూడెకరాల గురించి ఈటల ఎప్పుడైనా ప్రశ్నించారా?..అమరవీరుల కుటుంబాలకు సాయంపై ఈటల ఎప్పుడైనా కొట్లాడారా?' అని రేవంత్​ ప్ర‌శ్నించారు. కాంగ్రెస్​ తరఫున పోటీచేస్తున్న బల్మూరి వెంకట్​ గెలిచినా ఓడినా ప్రజల పక్షాన పోరాడుతారని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

  ఇద్దరూ దోచుకొంటున్నారు..
  'అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఈటల ఎందుకు మాట్లాడలేదు. హరీశ్‌రావు, ఈటల 20 ఏళ్లు కలిసి తిరగలేదా?. ఈటల, హరీశ్‌రావు కొట్లాటలో ఏమైనా పేదల సమస్య ఉందా?. మోదీకి, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలి. ఇద్దరూ కలిసి లీటర్ పెట్రోల్ ధర రూ.110 చేశారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ.వెయ్యి చేశారు. ఇలాంటి వారికి ఓటు వేయాలా లేక ప్రజల పక్షాన నిలబడి, ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ యువత కోసం పోరాడే శక్తి గల బల్మూరి వెంకట్ కు ఓటు వేయాలా అనే విషయమై హుజురాబాద్ ఓటర్ లు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వారితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజానర్సింహా గారు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ గారు, చిన్నరెడ్డి గారు ఎమ్మెల్యే సీతక్క మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, మల్లు రవి,మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సి ప్రేమ్ సాగర్ రావు మరియు ఉప ఎన్నికల మండల,గ్రామ ఇంచార్జిలు పాల్గొన్నారు.

  - పి.శ్రీ‌నివాస్‌, క‌రీంన‌గ‌ర్‌, న్యూస్‌18 తెలుగు

  Published by:Sharath Chandra
  First published: