హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad by-Poll : హుజూరా"బాద్‌షా" ఎవ‌రో తేలేది నేడే.. ఉత్కంఠ రేపుతున్న ఫ‌లితం

Huzurabad by-Poll : హుజూరా"బాద్‌షా" ఎవ‌రో తేలేది నేడే.. ఉత్కంఠ రేపుతున్న ఫ‌లితం

 ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Huzurabad by-Poll : రెండు దశాబ్దాలకుపైగా సీఎం కేసీఆర్‌కు ఆత్మీయుడిగా ఉండి, అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ (Etela Rajender) భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో హుజూరాబాద్ ఫలితంపై సర్వత్రా ఎనలేని ఆసక్తి ఏర్పడింది. నేడు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రం అంతా ఎంతో ఉత్కంఠ‌తో ఎవ‌రు గెలుస్తార‌ని ఎదురు చూస్తోంది.

ఇంకా చదవండి ...

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ‌కు తెర‌లేపిన ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం, రెండు దశాబ్దాలకుపైగా ఆయనకు ఆత్మీయుడిగా ఉండి, అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ (Etela Rajender) భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో హుజూరాబాద్ ఫలితంపై సర్వత్రా ఎనలేని ఆసక్తి ఏర్పడింది. రికార్డు స్థాయిలో (86.64 శాతం) పోలింగ్ తర్వాత గెల్లు శ్రీనివాస్ విజయంపై టీఆర్ఎస్ ధీమాగా ఉండగా, కరీంనగర్ (Karimnagar) లోని SRR కాలేజీ వేదికగా ఈటల రాజేందర్ గెలుపు ద్వారా గులాబీ దళానికి RRR సినిమా చూపించబోతున్నామని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.

పోస్ట‌ల్ బ్యాలెట్‌తో ప్రారంభం..

మంగళవారం ఉదయం 8గం టలకు లెక్కిం పు ప్రక్రియ ప్రారం భం కానుం ది. మొత్తం 753 పోస్టల్‌ ఓట్లు నమోదు కాగా.. మొదటి అరగం ట పాటు వాటిని లెక్కిం చనున్నా రు. అనంతరం జరిగే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంట‌ల‌కు తుది ఫ‌లితం వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఉప ఎన్నిక కౌంటిం గ్‌22 రౌం డ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌం డ్‌ ఫలితానికి 20 నుం చి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉం ది. అయితే, ఎక్కు వమం ది అభ్య ర్థులు బరిలో ఉం డటం వల్ల తుది ఫలితం ఆలస్య మయ్యే అవకాశం ఉంది.

ఈటల రాజేందర్ గెలిస్తే ఆ సభ పరిస్థితి ఏంటి.. TRSలో టెన్షన్ ?


పోటీ ద్విముఖ‌మే..

హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ ప్ర‌ధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య నెల‌కొంది. సెంటిమెంట్‌, లోక‌ల్ కార్డుతో ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ద‌ళిత‌బంధు, కేసీఆర్ ఇమేజ్‌ను న‌మ్ముకొని టీఆర్ఎస్ ఎన్నిక‌ల్లో దిగింది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌, కాంగ్రెస్ నుంచి బ‌ల్మూరి వెంక‌ట్‌, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు.

2004 నుంచి ఓట‌మెరుగ‌ని ఈట‌ల రాజేంద‌ర్‌..

2004లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంగా ఉండే స‌మ‌యంలో టీఆర్ఎస్ త‌రుఫు నుంచి ఈట‌ల రాజేంద‌ర్ అప్ప‌టి ప్ర‌త్య‌ర్థి ముద్దసాని దామోదర్ రెడ్డి పై 19,619 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంత‌రం 2008లో నిర్వ‌హించిన ఉప ఎన్నిక‌ల్లో అదే ప్ర‌త్య‌ర్థి ముద్దసాని దామోదర్ రెడ్డి పై ఈట‌ల రాజేద‌ర్ 22,284 మెజార్టీతో గెలిచారు. అనంత‌రం 2009లో నియోజ‌క‌వ‌ర్గాల పుర్విభ‌జ‌న త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌గా మారింది.

సంవ‌త్స‌రం గెలుపుప్ర‌త్య‌ర్థిమెజార్టీ
2009ఈట‌ల రాజేంద‌ర్ (56,752)కృష్ణమోహన్ వకులాభరణం (41,717)15,035
2010ఈట‌ల రాజేంద‌ర్ (93,026)మ‌ద్ద‌సాని దామోద‌ర్ రెడ్డి (13,799)79,227
2014ఈట‌ల రాజేంద‌ర్ (95,315)కేతిరి సుదర్శన్ రెడ్డి (38,278)57,037
2018ఈట‌ల రాజేంద‌ర్ (1,04,840)కౌశిక్ రెడ్డి (61,121)43,719


సర్వేలు ఏం చెబుతున్నాయి..

హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి ‘పీపుల్స్ పల్స్’ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైన మొగ్గు కనిపించింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంటుందని, మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం మాత్రమేనని ‘పీపుల్స్ పల్స్’ పేర్కొంది. హుజూరాబాద్ లో ఎన్నికల యుద్ధం రెండు పార్టీల మధ్యే జరిగిందని, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కానుందని పేర్కొంది. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో సానుకూలతగా మారాయని, ఈటల వ్యక్తిత్వం కూడా ఆయనకు ఓట్లు తెచ్చిపెట్టిందని ‘పీపుల్స్ పల్స్’ అభిప్రాయపడింది.

First published:

Tags: Bjp, CM KCR, Congress, Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, Trs

ఉత్తమ కథలు