Huzurabad By Poll: హుజురాబాద్ సర్వేమయం.. అన్ని పార్టీల సొంత‌ సర్వేలు.. ఏం అడుగుతున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గంలో సర్వేల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేంద్ రాజీనామాతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే.

  • Share this:
    హుజురాబాద్ అసెంబ్లీ నియోజవర్గంలో సర్వేల పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి ఈటల రాజేంద్ రాజీనామాతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక అనివార్య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి బరిలో నిలిచేందుకు సిద్దం కాగా.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈటలకు ధీటుగా ఏ అభ్యర్థి అయితే బెట‌ర్ గా ఉంటుందని ఒక పక్క అంచనాలు వేస్తూనే సర్వేలు చేపట్టారు. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలో ఉంచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. స్వంతంగా సర్వేలు చేయించడంతో పాటు స్పెషల్ బ్రాంచి, ఇంటలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ సర్వేలో ప్రశ్నావళి ఒక రకంగా ఉంటుండగా, బీజేపీ నిర్వహిస్తున్న సర్వేలో మరోరకంగా ఉంటున్నాయి. బీజేపీ ఈటల పై అభిప్రాయ సేకరణతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేక శాతాన్ని పసిగట్టేందుకు సర్వే చేయిస్తుంది.

    టీఆర్ఎస్ పార్టీ వారు ఈటలకు ధీటుగా ఏ అభ్యర్థి అయితే బెటర్ గా ఉంటందని కొందరు అభ్యర్థుల పేర్లను మార్కెట్లో వదలుతూ వారిలో ప్రజలకు ఉన్న అభిప్రాయంపై సర్వే చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కౌశిక్ రెడ్డి 21 న టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న‌ట్టుగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ.. ఆ పార్టీని వీడి ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరిపై కూడా టీఆర్ఎస్‌ సర్వే చేయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నం పోటీలో ఉంటే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీతో స‌ర్వే చేయిస్తోంది. ఇంకా.. స్వతంత్రులను పరిగణలోకి తీసుకుంటు ఏ పార్టీ అంటే ఇష్టం, ఏ వ్యక్తి అంటే ఇష్టం తదితర అంశాలను తీసుకొని కూడా పార్టీలు సర్వేలు చేస్తున్నాయి.

    చ‌ద‌వండి: Medak: ఫామ్ హౌస్‌లో న‌యా దందా.. అర్ధ‌రాత్రి పోలీసులు దాడి చేయ‌డంతో..

    ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయంకు చెందిన కొందరు పూర్వ విద్యార్ధులు , ప్రస్తుత విద్యార్థులుకలిసి ప్రైవేటుగా సర్వే చేయిస్తున్నారు. పార్టీలు నిర్వహిస్తున్న సర్వేకు భిన్నంగా వీరి సర్వే ఉంటుంది . కొన్ని వెబ్ ఛానల్స్ వారు , కొన్ని వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న పత్రికలు కూడా తమతమ రిపోర్టర్ల ద్వారా సర్వేలు చేయిస్తున్నాయి. ఒక పక్క ఈటలనే బీజేపీ అభ్యర్థిగా పేర్కొంటూ సర్వేలు కొనసాగుతుండగా ఈటల సతీమణి జమున హుజూరాబాద్ లో చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీ సింది. ఉద్యమస మయంలో , ఎన్నికల ప్రచార సమయంలో ఈటల వెనుక ఉన్నా , రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను మాలో ఎవరైనా ఉండవచ్చు కానీ గుర్తు మాత్రం ఒక్కటే అని సంచలన వ్యాఖ్యలు దుమారం లేపాయి.

    (పి శ్రీనివాస్‌, న్యూస్ 18 తెలుగు క‌ర‌స్పాండెంట్‌-క‌రీంన‌గ‌ర్)
    Published by:Sumanth Kanukula
    First published: