Huzurabad By-election 2021 : ఎవ‌రిది గెలుపు.. ఎవ‌రిది ఓట‌మి?.. హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజ‌కీయం

ప్రతీకాత్మక చిత్రం

హుజూరాబాద్ (Huzurabad) ఉపఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మూడు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు ప్రచారంలో వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ప్ర‌తీ ఒక్క‌రు గెలుపు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ సొంత చ‌రిష్మాను నమ్ముకోగా.. టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తోంది.

 • Share this:
  - పి.శ్రీ‌నివాస్‌, క‌రీంన‌గ‌ర్‌, న్యూస్ 18

  హుజూరాబాద్ (Huzurabad) ఉపఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మూడు పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు ప్రచారంలో వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధర్మమే గెలుస్తుందని తన ప్రచార సరళిలో పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో కాలు నొప్పితో పాదయాత్రను రద్దు చేసుకొని గ్రామ గ్రామాల్లో గడపగడపకు ఒక్కరే ప్రచారం చేశారు. అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ముందున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర కేంద్ర నాయకులు నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది .

  సొంత చ‌రిష్మాను న‌మ్ముకొన్న ఈట‌ల రాజేంద‌ర్‌..
  ఈటల రాజేందర్ కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు మంత్రి పదవులను పొందాడు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే తన సొంత చరిష్మా ఉంటుందని భావిస్తున్నారు . 2018 ఎన్నికల్లో ఆనాటి బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన అభ్యర్థి సుమారు పదహారు వందల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి . ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేయడం వల్ల ఆయన పార్టీ బలంతో కాకుండా సొంత చరిష్మాను నమ్ముకొని ఆయన ప్రచారం చేస్తున్నారు .

  Telangana : "మ‌త్తు"పై ఉక్కుపాదం.. విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు..


  టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం
  మరోవైపు టీఆర్ఎస్ (TRS) అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు గెలిపిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నారు . రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని గెల్లు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని రాష్ట్ర మంత్రి హరీష్ రావు పూర్తిస్థాయిలో నియోజక వర్గంలో ఉంటూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు . గతంలో ఈటెలతో ఉన్నా చోటామోటా నాయకులను టీఆర్ఎస్ కండువాలు కప్పాడు . దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మండలాల వారీగా మంత్రులు , ఎమ్మెల్యేలు , నాయకులు బాధ్యతలు తీసుకొని గడప , గడపకు ప్రచారం చేస్తూ కుల సంఘాలను మచ్చిక చేసుకుంటూ వారికి అడిగిందే తడవుగా తాయిలాలు ప్రకటిస్తున్నారు .

  Telangana : ద‌స‌రా సెల‌వుల‌కు ఊరెళ్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌లు పాటించండి


  కాంగ్రెస్‌కు బ‌ల ప‌రీక్ష‌..
  ఇంకోవైపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండట్టేందుకు కాంగ్రెస్ (Congress) అభ్యర్థి బల్మూరి వెంకట్ సిద్ధమయ్యారు . హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానికేతరుడైన బల్మూర్ వెంకట్ కు టిక్కెట్ కేటాయించారు . నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు అధిష్టానం వద్ద టికెట్ కావాలని ఆశించిన పార్టీ నాయకత్వం మాత్రం స్థానికేతరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు యువకుడు వెంకట కు టికెట్ కేటాయించడం వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంత మేరకు సహాకరిస్తారో వేచి చూడా ల్సిందే .

  బల్మూర్ వెంకట్ నామినేషన్ వేసిన అప్పటినుండి నియోజకవర్గం లో ప్రచారం నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసాలను గడపగడపకు ప్రచారం చేస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు . 2018 సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి సుమారు 60 వేల పైచిలుకు ఓట్లు రావడం , ప్రస్తుతం ఉప ఎన్నికల్లో స్థానికేతరుడైన బల్మూరి వెంకట్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఏవిధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే ..
  Published by:Sharath Chandra
  First published: