Huzurabad By-election 2021 : ఓట‌రు.. ఎటువైపు? అంత‌ప‌ట్ట‌ని ప్ర‌జా నాడి.. తలలు పట్టుకుంటున్న ప్రధాన పార్టీలు

ప్రతీకాత్మక చిత్రం

హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By-Election) పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఓట‌రు నాడి అంతుప‌ట్ట‌డం లేదు. మరో నాలుగురోజుల్లో బ‌హిరంగ ప్ర‌చారానికి తెప‌డుతోంది. దీంతో ప్ర‌ధార పార్టీల మ‌ధ్య మాట‌ల తీవ్ర‌త పెరుగుతోంది. అయినా ఓట‌రు నాడి అంత‌ప‌ట్ట‌డం లేదు. ఎవ‌రికి ఓటు వేస్తామో స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు.

 • Share this:
  హుజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad By-Election) పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఓట‌రు నాడి అంతుప‌ట్ట‌డం లేదు. మరో నాలుగురోజుల్లో బ‌హిరంగ ప్ర‌చారానికి తెప‌డుతోంది. దీంతో ప్ర‌ధార పార్టీల మ‌ధ్య మాట‌ల తీవ్ర‌త పెరుగుతోంది. ముఖ్యంగా నువ్వా .. నేనా అన్న రీతిలో టీఆర్ఎస్ (TRS) , బీజేపీ (BJP) అభ్య‌ర్థుల‌ మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతోంది. గెలుపుపై ఎవ‌రి ధీమా వారిది. ఎవ‌రు గెలుస్తారు అనే అంశంపై ప‌లు సంస్థ‌లు స‌ర్వేలు (Survey) నిర్వ‌హిస్తున్నాయి. ఈ స‌ర్వేల్లో రోజు రోజుకు మార్పులు క‌నిపిస్తుండంతో రాజ‌కీయ విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. స‌ర్వే రిపోర్టు నివేద‌కల‌కు రోజు పొంత‌న కుద‌రండం లేద‌ని స‌ర్వే నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఇటీవ సీఎం కేసీఆర్(CM KCR) 13శాతం ఓట్ల‌తో టీఆర్ఎస్‌ గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇటు బీజేపీ నేత‌లు మా గెలుపు ఖాయం అంటూ వారి స‌ర్వేలు చెబుతున్నారు.

  కార్య‌క‌ర్త‌లు అటు..ఇటు..
  నిన్నటి వరకు ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు తెల్లారేసరికి వేరే పార్టీ కండువా కప్పుకోవడం ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నాలుగు రోజులే కీలకం సరిగ్గా మరో నాలుగు రోజుల్లో ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ (Assembly) ఉప ఎన్నిక ప్రచారపర్వం ముగియనుంది .

  Telangana : మ‌త్స్యశాఖ భూమి.. మందిపాలు.. నిజామాబాద్‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జాయ‌త్నం


  ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30 న పోలింగ్ (Polling) జరుగనుంది . ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రలోభాలకు చేయడం సాధారణ గురి అయినా .. వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారిన హుజూరాబాద్ లో అభ్యర్థులు గెలుపుకోసం కోట్లాది రూపాయలు గుమ్మరిస్తున్నారు.

  మ‌హిళ‌ల ఓట్లే కీల‌కం..
  మహిళా ఓటర్లను ఆకట్టకునేందుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సతీమణి జమునను ముందు వరుసలో నిలిపి ప్రచారం చేయిస్తున్నారు . మంత్రి హరీశ్ రావు సైతం నిత్యం మహిళలను వెంటబెట్టుకుని క్యాంపెయిన్ (Campaign) నిర్వహిస్తున్నారు . నోటిఫికేషన్ కు ముందే ఇక్కడ మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వడం , రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వకపోవడం తెలిసిందే . ఒకే విడుతలో 160 కిపైగా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కూడా చూసాము.నిఘా వర్గాలతోపాటుగా ప్రైవేట్ సంస్థలూ సర్వే చేస్తున్నా కానీ ఇక్కడ మహిళల నుంచి మాత్రం సరైన రిప్లై రావడం లేదు.

  ఓటురు మౌనం..
  నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు ఎన్ని స‌ర్వేలు చేస్తున్నా.. ఎవరికి ఓటేస్తామనే అంశం ఎక్కడా స్ప‌ష్టంగా చెప్పడం లేదు. చాలా మంది తమకు నచ్చిన వారికి వేస్తామంటూనే విషయాన్ని దాటవేస్తున్నారు. సర్వేల ప్రకారం ఎవరికి ఓటేస్తామని చెప్పిన వారిలో మహిళలు 6 % మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుతం సర్వే నివేదికలు ఆయోమయానికి గురి చేస్తున్నాయి. ఒక రోజు బీజేపీ గెలుస్తుందని.. మరో రోజు వెంటనే పరిణామాలు మారిపోతున్నాయి. బీజేపీ గెలుస్తుందని చెప్పేలోపే టీఆర్ఎస్‌కు చాన్స్ అని, ఆ వెంటనే మళ్లీ బీజేపీ అంటూ నివేదికల్లో మార్పులు చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

  - పి.శ్రీనివాస్, క‌రీంన‌గ‌ర్, న్యూస్‌18 తెలుగు

  Published by:Sharath Chandra
  First published: