Huzurabad By-election 2021 : ఆ ప‌ని చేసి స‌వాలు చేయండి..పెట్రోల్ ధ‌ర‌ల‌పై టీఆర్ఎస్‌కు కిష‌న్ రెడ్డి స‌వాల్‌

కిషన్ రెడ్డి

హుజూరాబాద్ ఎన్నిక‌లు ((Huzurabad Election) ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్‌కు స‌వాల్ విసిరారు.

  • Share this:
    హుజూరాబాద్ ఎన్నిక‌లు ((Huzurabad Election) ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. పెట్రోల్ ధ‌ర‌ల విష‌యంలో కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్న టీఆర్ఎస్ నేత‌లు ముందు రాష్ట్ర ఖ‌జానాకు ఇంధ‌న ధ‌ర‌ల వ‌ల్ల వ‌చ్చే ఆదాయాన్ని త‌గ్గించుకొని త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయాల‌ని స‌వాల్ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతోందని ఆయ‌న విమ‌ర్శించారు. టీఆర్ఎస్ ఎన్ని చేసినా.. గెలిచేది బీజేపీనేని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.  హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారం  మొన్నటి వరకు ప్రశాంతంగానే సాగింది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) , కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు..ఎవరికి వారు రోడ్ షోలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఇప్పుడిప్పుడే వేడి పెరిగింది. పార్టీల మధ్య గొడవలు మొదలయ్యాయి.

    Telangana Drug Case : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిన స‌ర్పంచ్‌.. ఎక్క‌డంటే?


    ర్యకర్తలు కొట్టుకుంటున్నారు. శుక్రవారం హుజురాబాద్‌లో జరిగిన ఓ ఘటన తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రచారాన్ని టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకోవడం, వారితో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ నేప‌థ్యంలోనే కిష‌న్ రెడ్డి ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావార‌ణంలో జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను కోరారు.  ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌ల‌పై కేసీఆర్‌, రాజాసింగ్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ కూడా న‌డిచింది. ఇంధ‌న ధ‌ర‌లు టీఆర్ఎస్ నేత‌లు కూడా ఎన్నికల ప్ర‌చారంలో బీజేపీని పెట్రోల్ ధ‌ర‌ల‌పై టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

    బండి సంజ‌య్ ఫైర్‌..
    పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Telangana Inter Exams : ప‌రీక్ష‌లంటే భ‌య‌మా.. అయితే కాల్ చేయండి : క్లినిక‌ల్ సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఇంట‌ర్ బోర్డు


    పన్నుల పేరు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుందని ఆరోపించారు. వాస్తవానికి లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోందన్నారు. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నుల మొత్తాన్ని మినహాయించుకోంటూ రూ.60కే లీటర్ పెట్రోలు అందించవచ్చని సవాల్ విసిరారు. రోడ్లు, డ్రైనేజీ , ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం  సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోందని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు.
    Published by:Sharath Chandra
    First published: